నశియించెడి లోకంలో - YouWorship
Nashiyinchedi Lokamlo
Artist: జాన్ వెస్లీ
Category: Correction
Song Lyrics
నశియించెడి లోకంలో – వసియించవు కలకాలం మేలైనది చేపట్టి – సాగించు నీ పయనం – (2) అది నాదంటూ ఇది నాదంటూ – ఆనందం కోల్పోతూ పరమార్ధం గ్రహియించకనే – గతియించిపోతావా ||నశియించెడి|| కాలంతో పాటుగా కృశియించును శరీరం మరణం కబళించును ఏ ఘడియలోనైనా (2) క్రీస్తు దారిలో సాగి – నిత్య రాజ్యమే చేరి (2) వసియించు కలకాలం – సత్యమైన లోకంలో ||నశియించెడి|| నిలచిపోవును మహిలోన బంధాలన్ని మట్టిలో కలియును దేహం రిక్త హస్తాలతో (2) ఇకనైనా తేరుకొని – గ్రహియించు సత్యాన్ని (2) యేసులోకి మళ్ళించు – నీ జీవిత గమనాన్ని ||నశియించెడి|| Nashiyinchedi Lokamlo – Vasiyinchavu Kala Kaalam Melainadi Chepatti – Saaginchu Nee Payanam – (2) Adi Naadantu Idi Naadantu – Aanandam Kolpothu Paramaardham Grahiyinchakane – Gathiyinchipothaavaa ||Nashiyinchedi|| Kaalamtho Paatugaa Krushiyinchunu Shareeram Maranam Kabalinchunu Ae Ghadiyalonainaa (2) Kreesthu Daarilo Saagi – Nithya Raajyame Cheri (2) Vasiyinchu Kala Kaalam – Sathyamaina Lokamlo ||Nashiyinchedi|| Nilachipovunu Mahilona Bandhaalanni Mattilo Kaliyunu Deham Riktha Hasthaalatho (2) Ikanaina Therukoni – Grahiyinchu Sathyaanni (2) Yesuloki Mallinchu – Nee Jeevitha Gamanaanni ||Nashiyinchedi||