నమ్మవద్దు నమ్మవద్దు - YouWorship
Nammavaddu Nammavaddu
Artist: Unknown Artist
Category: Praise & Worship
Song Lyrics
ప|| నమ్మవద్దు - నమ్మవద్దు ఈ మాయలోకం - నమ్మవద్దు ఇది - ఆశజూపి మోసం జేయు - ఈ మాయలోకం గనుక 1. మిమ్మునుగన్న తల్లి యేది - మిమ్మునుగన్న తండ్రియేడి నాతోడబుట్టిన తోడులు - వార్ని కాటికి మోసిన కోటప్ప లేరి - గనుక ||నమ్మ|| 2. మీరు కట్టిన యిండ్లు ఏవి మీరు - కట్టిన కోటలు ఏవి - కొట్టి తిన్న పొట్టలు ఉన్నవా? మెట్టలు పల్లాలవ్వక మానునా - గనుక ||నమ్మ|| 3. త్రవ్విన బావులు ఏవి - మీరు త్రాగిన నదులు ఏవి ఏరులు ఎండకుండునా? కారులు మరచెడకుండునా - గనుక ||నమ్మ|| 4. మీరు కట్టిన బట్టలు - ఏవి - చుట్టి త్రాగిన చుట్టలు ఏవి - కట్టినబట్ట మట్టికెకదా? చుట్టిన చుట్ట అగ్గికి కదా - గనుక ||నమ్మ|| 5. మనం మట్టినుండి తీయబడితిమి - మట్టితో పుట్టబడితిమి - ఎట్టి బ్రతుకు బ్రతికినగాని కట్టెకాటికి పదపదరన్నా - గనుక ||నమ్మ|| 6. యేసు ప్రభుని నమ్మండిప్పుడే - మోసపోకుడి ఈ ధరణిలో - ప్రయాసపడి భారమును మోసెడి ఓ ప్రజలారా - గనుక ||నమ్మ|| Pa|| Nammavaddu - Nammavaddu Ee Maayalokan - Nammavaddu Idi - Aashajoopi Mosan Jeyu - Ee Maayalokan Ganuka 1. Mimmunuganna Thalli Yedi - Mimmunuganna Thandriyedi Naathodabuttina Thodulu - Vaarni Kaatiki Mosina Kotappa Leri - Ganuka ||Namma|| 2. Meeru Kattina Yindlu Evi Meeru - Kattina Kotalu Evi - Kotti Thinna Pottalu Unnavaa? Mettalu Pallaalavvaka Maanunaa - Ganuka ||Namma|| 3. Thravvina Baavulu Evi - Meeru Thraagina Nadulu Evi Erulu Endakundunaa? Kaarulu Marachedakundunaa - Ganuka ||Namma|| 4. Meeru Kattina Battalu - Evi - Chutti Thraagina Chuttalu Evi - Kattinabatta Mattikekadaa? Chuttina Chutta Aggiki Kadaa - Ganuka ||Namma|| 5. Manan Mattinundi Theeyabadithimi - Mattitho Puttabadithimi - Etti Brathuku Brathikinagaani Kattekaatiki Padapadarannaa - Ganuka ||Namma|| 6. Yesu Prabhuni Nammandippude - Mosapokudi Ee Dharanilo - Prayaasapadi Bhaaramunu Mosedi O Prajalaaraa - Ganuka ||Namma||