నమ్మదగిన మా దేవా పరిశుద్ధుడా - YouWorship
Nammadagina Maa Devaa Parishuddhadaa
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: నమ్మదగిన మా దేవా - పరిశుద్ధుడా, నీతిమంతుడా (2) మహామహిమలో వసియించెడు - మహిమగల మహారాజా (2) 1. మా పాపములను మే మొప్పుకొనగా - క్షమియించితివి నమ్మదగినవాడవై (2) నీ రక్తముతో ప్రతిపాపమును (2) - కడిగి శుద్ధులుగా చేసిన దేవా (2) నిన్ను మేము పూజింతుము (2) 2. వాగ్దానములిచ్చి నెరవేర్చువాడు - నమ్మకమైన సత్యసాక్షినై ఆదియు అంతములేనివాడా - మృతుడై సజీవుడుగా లేచినవాడా నిన్ను మేము కీర్తింతుము 3. శత్రువు మాపై చెలరేగుచుండగా - అండగా నుండి మమ్మాదుకొంటివే నీ నమ్మకత్వము మేమెన్న తరమా - మాటతప్పని మహోపకారీ నిన్ను మేమారాధింతుము 4. గాలి తుఫానుల కల్లోలములతో- మా నావ అలలచే అల్లాడుచుండగా గాలి తుఫానులు గద్దించితివే - మము దరిచేర్చిన మహానుభావా నిన్ను మేము స్తుతియింతుము 5. పది దినములు శ్రమ కలుగునంటివి - నమ్మకముగ నుండు మరణము వరకని జీవకిరీటము నిచ్చెదననిన - మొదటివాడవు కడపటివాడా నిన్ను మేము ఘనపరతుము 6. పిలిచితివి మమ్ము నీ కుమారుని - సహవాసమునకు నమ్మదగినవాడవై పరిశుద్ధమైన పరలోక పిలుపుతో - నీ విశ్వాస్యత బుద్ధి కందదే వందనములు చెల్లింతుము 7. వచ్చుచున్నవాడు నమ్మకమైన - సత్యవంతుడను నామము గలవాడు దేవుని వాక్యమును నామము గలవాడు - రాజులరాజు ప్రభువుల ప్రభువు హల్లెలూయ (అమేన్ (2) Pallavi: Nammadagina Maa Devaa - Parishuddhadaa, Neethimanthudaa (2) Mahaamahimalo Vasiyinchedu - Mahimagala Mahaaraajaa (2) 1. Maa Paapamulanu Me Moppukonagaa - Kshamiyinchithivi Nammadaginavaadavai (2) Nee Rakthamutho Prathipaapamunu (2) - Kadigi Shuddhulugaa Chesina Devaa (2) Ninnu Memu Poojinthumu (2) 2. Vaagdaanamulichchi Neraverchuvaadu - Nammakamaina Sathyasaakshinai Aadiyu Anthamulenivaadaa - Mruthudai Sajeevudugaa Lechinavaadaa Ninnu Memu Keerthinthumu 3. Shathruvu Maapai Chelareguchundagaa - Andagaa Nundi Mammaadukontive Nee Nammakathvamu Memenna Tharamaa - Maatathappani Mahopakaaree Ninnu Memaaraadhinthumu 4. Gaali Thuphaanula Kallolamulatho- Maa Naava Alalache Allaaduchundagaa Gaali Thuphaanulu Gaddinchithive - Mamu Daricherchina Mahaanubhaavaa Ninnu Memu Sthuthiyinthumu 5. Padi Dinamulu Shrama Kalugunantivi - Nammakamuga Nundu Maranamu Varakani Jeevakireetamu Nichchedananina - Modativaadavu Kadapativaadaa Ninnu Memu Ghanaparathumu 6. Pilichithivi Mammu Nee Kumaaruni - Sahavaasamunaku Nammadaginavaadavai Parishuddhamaina Paraloka Piluputho - Nee Vishvaasyatha Buddhi Kandade Vandanamulu Chellinthumu 7. Vachchuchunnavaadu Nammakamaina - Sathyavanthudanu Naamamu Galavaadu Devuni Vaakyamunu Naamamu Galavaadu - Raajularaaju Prabhuvula Prabhuvu Hallelooya (Amen (2)