నమ్మదగినవాడవు నెమ్మదిని - YouWorship
Nammadaginavaadavu Nemmadini
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: నమ్మదగినవాడవు - నెమ్మదిని చేకూర్చను యిమ్మహిలో యెంతైనను - నమ్మిన నను గాచెడి 1. అలలు గాలి తుఫానులవలె - శ్రమలు నన్నిలగొట్టిన అమరమందు నిల్చియేసు - అన్నిటిని గద్దించును 2. నరుల రాజులనమ్మిన - నిరుపయోగమె యెందున కరము జాచిన కష్టములలో - కొరతలన్నిటి తీర్చును 3. యాత్రికులు ప్రయాణికులుగా - యాతనలు మే బొందిన నూతన జీవముతో నీ - పాత్రలుగను వాడను 4. ఆత్మ జీవశరీరములను - ప్రభువు రాకడ యందున నిందారహిత సంపూర్ణ మహిమలో - నుండునట్లుగ నిల్పను 5. పరమ తండ్రి కృపాతిశయమును - నిరతమును కీర్తించెద తరములకు విశ్వాస్యతను నా - నోటితోనే తెల్పెద 6. శోధనలన్నీ సహించెడి - వరకె నా కవినిచ్చియు శోధనలు తప్పించుకొను యా - మార్గమును కలిగించుము Pallavi: Nammadaginavaadavu - Nemmadini Chekoorchanu Yimmahilo Yenthainanu - Nammina Nanu Gaachedi 1. Alalu Gaali Thuphaanulavale - Shramalu Nannilagottina Amaramandu NilchiYesu - Annitini Gaddinchunu 2. Narula Raajulanammina - Nirupayogame Yenduna Karamu Jaachina Kashtamulalo - Korathalanniti Theerchunu 3. Yaathrikulu Prayaanikulugaa - Yaathanalu Me Bondina Noothana Jeevamutho Nee - Paathraluganu Vaadanu 4. Aathma Jeevashareeramulanu - Prabhuvu Raakada Yanduna Nindaarahitha Sampoorna Mahimalo - Nundunatluga Nilpanu 5. Parama Thandri Krupathishayamunu - Nirathamunu Keerthincheda Tharamulaku Vishvaasyathanu Naa - Notithone Thelpeda 6. Shodhanalannee Sahinchedi - Varake Naa Kavinichchiyu Shodhanalu Thappinchukonu Yaa - Maargamunu Kaliginchumu