నమ్మకమైన నా స్నేహితుడు - YouWorship
Nammakamaina
Artist: దియ్యా ప్రసాద రావు
Category: Praise
Song Lyrics
నమ్మకమైన నా స్నేహితుడు నా ప్రభు యేసుడు (2) ఎడబాయనివాడు విడువనివాడు (2) నిన్న నేడు ఒకటిగనున్నవాడు ||నమ్మకమైన|| ఆపదలో ఆనందములో నను వీడనివాడు (2) వ్యాధిలో భాధలో (2) నను స్వస్థపరచువాడు అనుక్షణం నా ప్రక్కన నిలచి ప్రతిక్షణం నా ప్రాణం కాచి (2) అన్నివేళలా నన్నాదరించువాడు (2) నా ప్రియ స్నేహితుడు నా ప్రాణహితుడు (2) ||నమ్మకమైన|| కలిమిలో లేమిలో నను కరుణించువాడు (2) కలతలలో కన్నీళ్ళలో (2) నను ఓదార్చువాడు కన్నతల్లిని మించిన ప్రేమతో అరచేతిలో నను దాచినవాడు (2) ఎన్నడు నన్ను మరువనివాడు (2) నా ప్రియ స్నేహితుడు నా ప్రాణ హితుడు (2) ||నమ్మకమైన|| Nammakamaina Naa Snehithudu Naa Prabhu Yesudu (2) Edabaayanivaadu Viduvanivaadu (2) Ninna Nedu Okatiganunnavaadu ||Nammakamaina|| Aapadalo Aanandamulo Nanu Veedanivaadu (2) Vyaadhilo Bhaadhalo (2) Nanu Swasthaparachuvaadu Anukshanam Naa Prakkana Nilachi Prathikshanam Naa Praanam Kaachi (2) Annivelala Nannaadarinchuvaadu (2) Naa Priya Snehithudu Naa Praana Hithudu (2) ||Nammakamaina|| Kalimilo Lemilo Nanu Karuninchuvaadu (2) Kalathalalo Kanneellalo (2) Nanu Odaarchuvaadu Kanna Thallini Minchina Prematho Arachethilo Nanu Daachinavaadu (2) Ennadu Nannu Maruvanivaadu (2) Naa Priya Snehithudu Naa Praana Hithudu (2) ||Nammakamaina||