నమస్కరింప రండి - YouWorship
Namaskarimpa Randi
Artist: జేమ్స్ మాంట్‌గోమరీ
Category: Praise & Worship
Song Lyrics
నమస్కరింప రండి దావీదు పుత్రుని శ్రీ యేసు రక్షకుండు ఏతెంచె భూమికి న్యాయంబు లోకమందు స్థాపించి నిత్యము అన్యాయ మంత దాను పొంగొట్టవచ్చెను. 1. వర్షంబు పడునట్లు శుష్కించు నేలను దుఃఖించు వారికెల్ల హర్షంబు నిచ్చును శ్రీ యేసు రాజ్యమందు సద్భక్తులందరు ఖర్జూర వృక్ష రీతిన్ వర్ధిల్లుచుందురు. 2. దిగంతవాసు లైన భూరాజు లందరు శ్రీ యేసు చరణంబుల్ నమస్కరింతురు భూలోకవాసులైన జనంబు లందరు క్రీస్తు స్వాధీనమందు జీవింతు రెప్పుడు. 3. విరోధులైన వారిన్ జయింప నెన్నండున్ సింహాసనంబుమీంద ఆసీనుండగును అత్యంత ప్రేమమూర్తి శ్రీ యేసు ప్రభువు ఆ దివ్య నామకీర్తి వ్యాపించు నీ భువిన్. Namaskarimpa Randi Daaveedu Puthruni Shree Yesu Rakshakundu Ethenche Bhoomiki Nyaayambu Lokamandu Sthaapinchi Nithyamu Anyaaya Mantha Daanu Ponggottavachchenu. 1. Varshambu Padunatlu Shushkinchu Nelanu Duhkhinchu Vaarikella Harshambu Nichchunu Shree Yesu Raajyamandu Sadbhakthulandaru Kharjoora Vruksha Reethin Vardhilluchunduru. 2. Diganthavaasu Laina Bhooraaju Landaru Shree Yesu Charanambul Namaskarinthuru Bhoolokavaasulaina Janambu Landaru Kreesthu Svaadheenamandu Jeevinthu Reppudu. 3. Virodhulaina Vaarin Jayimpa Nennandun Sinhaasanambumeenda Aaseenundagunu Athyantha Premamoorthi Shree Yesu Prabhuvu Aa Divya Naamakeerthi Vyaapinchu Nee Bhuvin.