నన్ను గన్నయ్య రావె - YouWorship
Nannu Gannayya Raave
Artist: పురుషోత్తము చౌదరి
Category: Repentance
Song Lyrics
నన్ను గన్నయ్య రావె నా యేసు నన్ను గన్నయ్య రావె నా ప్రభువా ||నన్ను|| ముందు నీ పాదారవిందము లందు నిశ్చల భక్తి ప్రేమను (2) పొందికగా జేయరావే నా డెందమానంద మనంతమైయుప్పొంగ ||నన్ను|| హద్దులేనట్టి దురాశల నవివేకినై కూడి యాడితి (2) మొద్దులతో నింక కూటమి వద్దయ్య వద్దయ్య వద్దయ్య తండ్రి ||నన్ను|| కాలము పెక్కు గతించెను గర్వాదు లెడదెగవాయెను (2) ఈ లోకమాయ సుఖేచ్ఛలు చాలును జాలును జాలు నోతండ్రి ||నన్ను|| దారుణ సంసార వారధి దరి జూపి ప్రోవ నీ కన్నను (2) కారణ గురువు లింకెవ్వరు లేరయ్య – లేరయ్య లేరయ్య తండ్రి ||నన్ను|| నా వంటి దుష్కర్మ జీవిని కేవలమగు నీదు పేర్మిని (2) దీవించి రక్షింపనిప్పుడే రావయ్య రావయ్య రావయ్య తండ్రి ||నన్ను|| Nannu Gannayya Raave Naa Yesu Nannu Gannayya Raave Naa Prabhuvaa ||Nannu|| Mundu Nee Paadaaravindamu Landu Nischala Bhakthi Premanu (2) Pondikagaa Jeyaraave Naa Dendamaananda Mananthamai Yupponga ||Nannu|| Haddu Lenatti Duraashala Navivekinai Koodi Yaadithi (2) Moddulatho Ninka Kootami Vaddayya Vaddayya Vaddayya Thandri ||Nannu|| Kaalamu Pekku Gathinchenu Garvaadu Ledadhegavaayenu (2) Ee Loka Maaya Sukhechchalu Chaalunu Jaalunu Jaalu-no Thandri ||Nannu|| Daaruna Samsaara Vaaradhi Dari Joopi Prova Nee Kannanu (2) Kaarana Guruvu Linkevvaru Lerayya Lerayya Lerayya Thandri ||Nannu|| Naa Vanti Dushkarma Jeevini Kevalamagu Needu Permini (2) Deevinchi Rakshimpanippude Raavayya Raavayya Raavayya Thandri ||Nannu||