నడిపించు నా నావా - YouWorship
Nadipinchu Naa Naavaa
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
నడిపించు నా నావా నడి సంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరియింప ||నడిపించు|| నా జీవిత తీరమున నా అపజయ భారమున నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు నా యాత్మ విరబూయ నా దీక్ష ఫలియింప నా నావలో కాలిడుము నా సేవ చేకొనుము ||నడిపించు|| రాత్రంతయు శ్రమపడినా రాలేదు ప్రభు జయము రహదారులు వెదకిననూ రాదాయెను ప్రతిఫలము రక్షించు నీ సిలువ రమణీయ లోతులలో రతణాలను వెదకుటలో రాజిల్లు నా పడవ ||నడిపించు|| ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ చెలిమి అహమును ప్రేమించుచునే అరసితి ప్రభు నీ కలిమి ఆశ నిరాశాయే ఆవేదనెదురాయే ఆధ్యాత్మిక లేమిగని అల్లాడే నావలలు ||నడిపించు|| ప్రభు మార్గము విడచితిని ప్రార్థించుట మానితిని ప్రభు వాక్యము వదలితిని పరమార్థము మరచితిని ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును బొంది ఫలహీనుడనై యిపుడు పాటింతు నీ మాట ||నడిపించు|| లోతైన జలములలో లోతున వినబడు స్వరమా లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి లోనున్న ఈవులలో లోటైన నా బ్రతుకు లోపించని అర్పనగా లోకేష చేయుమయా ||నడిపించు|| ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కథ పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణంబును ప్రభు కొరకు పానార్పణము చేతు ||నడిపించు|| Nadipinchu Naa Naavaa – Nadi Sandramuna Devaa Nava Jeevana Maargamuna – Naa Janma Thariyimpa ||Nadipinchu|| Naa Jeevitha Theeramuna – Naa Apajaya Bhaaramuna Naligina Naa Hrudayamunu – Nadipinchumu Lothunaku Naa Yaathma Virabooya – Naa Deeksha Phaliyimpa Naa Naavalo Kaalidumu – Naa Seva Chekonumu ||Nadipinchu|| Raathranthayu Shramapadinaa – Raaledu Prabhu Jayamu Rahadaarulu Vedakinanoo – Raadaayenu Prathiphalamu Rakshinchu Nee Siluva – Ramaneeya Lothulalo Rathanaalanu Vedakutalo – Raajillu Naa Padava ||Nadipinchu|| Aathmarpana Cheyakaye – Aashinchiti Nee Chelimi Ahamunu Preminchuchune – Arasithi Prabhu Neekalimi Aasha Nirashaye – Aavedha Nedhuraye Aadhyathmika Lemigani – Allade Naa Valalu ||Nadipinchu|| Prabhu Maargamu Vidachithini – Prardhinchuta Maanithini Prabhu Vaakyamu Vadhalithini – Paramardhamu Marachithini Prapancha Natanalalo – Praveenyamunu Pondhi Phala Heenudanai Ipudu – Paatinthu Nee Maata ||Nadipinchu|| Lothaina Jalamulalo – Lothuna Vinabadu Swaramaa Lobadutanu Nerpinchi – Lopambulu Savarinchi Lonunna Eevulalo – Lotaina Naa Brathuku Lopinchani Arpanagaa – Lokesha Cheyumayaa ||Nadipinchu|| Prabhu Yesuni Shishyudanai – Prabhu Premalo Paadukoni Prakatinthunu Lokamulo – Parishudhdhuni Prema Katha Paramaathma Prokshanatho – Paripoorna Samarpanatho Praanambunu Prabhu Koraku – Praanaarpanamu Chethu ||Nadipinchu||