ధ్యానించుచుంటిమి - YouWorship
Dhyaaninchuchunitimi
Artist: ఏ ఆర్ స్టీవెన్సన్
Category: Good Friday
Song Lyrics
ధ్యానించుచుంటిమి సిలువపై పలికిన – విలువైన నీ మాటలు ప్రాణాత్మలను సేదదీర్చు జీవ ఊటలు (2) మోక్షమునకు చేర్చు బాటలు పరిశుద్ధతలో పరిపూర్ణుడా – ఉన్నత గుణ సంపన్నుడా (2) శ్రేష్టుడా… ||ధ్యానించుచుంటిమి|| తండ్రి వీరేమి చేయుచున్నారో ఎరుగరు వీరిని దయతో క్షమించుము (2) అని ప్రార్ధన చేసావా బాధించే వారికి (2) శత్రువులను ప్రేమించుట నేర్పుటకై (2) ||పరిశుద్ధతలో|| నేడే నాతోను పరదైసులో నీవుందువు నిశ్చయముగ ప్రవేశింతువు (2) అని మాట ఇచ్చావా దొంగ వైపు చూచి (2) అధికారముతో పాపిని రక్షించి (2) ||పరిశుద్ధతలో|| ఇదిగో నీ తల్లి ఇతడే నీ కుమారుడు కష్టము రానీయకు ఎప్పుడు (2) అని శిష్యునికిచ్చావా అమ్మ బాధ్యతను (2) తెలియజేయ కుటుంబ ప్రాధాన్యతను (2) ||పరిశుద్ధతలో|| దేవా నా దేవా నను విడనాడితివెందుకు చెవినీయవె నా ప్రార్థనకు (2) అని కేక వేసావా శిక్షననుభవిస్తూ (2) పరలోక మార్గం సిద్ధము చేస్తూ (2) ||పరిశుద్ధతలో|| సర్వ సృష్టికర్తను నే దప్పిగొనుచుంటిని వాక్యము నెరవేర్చుచుంటిని (2) అని సత్యము తెలిపావా కన్నులు తెరచుటకు (2) జీవ జలమును అనుగ్రహించుటకు (2) ||పరిశుద్ధతలో|| సమాప్తిమయ్యింది లోక విమోచన కార్యం నెరవేరెను ఘన సంకల్పం (2) అని ప్రకటన చేసావా కల్వరి గిరి నుంచి (2) పని ముగించి నీ తండ్రిని ఘనపరచి (2) ||పరిశుద్ధతలో|| నా ఆత్మను నీ చేతికి అప్పగించుచుంటిని నీ యొద్దకు వచ్చుచుంటిని (2) అని విన్నవించావా విధేయత తోటి (2) తల వంచి తృప్తిగ విజయము చాటి (2) ||పరిశుద్ధతలో|| Dhyaaninchuchuntimi Siluvapai Palikina – Viluvaina Nee Maatalu Praanaathmalanu Sedadeerchu Jeeva Ootalu (2) Mokshamunaku Cherchu Baatalu Parishuddhathalo Paripoornudaa – Unnatha Guna Sampannudaa (2) Sreshtudaa… ||Dhyaaninchuchuntimi|| Thandri Veeremi Cheyuchunnaaro Erugaru Veerini Dayatho Kshaminchumu (2) Ani Praardhana Chesaavaa Baadhinche Vaarikai (2) Shathruvulanu Preminchuta Nerputakai (2) ||Parishuddhathalo|| Nede Naathonu Paradaisulo Neevunduvu Nischayamuga Praveshinthuvu (2) Ani Maata Ichchaavaa Donga Vaipu Choochi (2) Adhikaaramutho Paapini Rakshinchi (2) ||Parishuddhathalo|| Idigo Nee Thalli Ithade Nee Kumaarudu Kashtamu Raaneeyaku Eppudu (2) Ani Shishyunikichchaavaa Amma Baadhyathanu (2) Theliyajeya Kutumba Praadhaanyathanu (2) ||Parishuddhathalo|| Devaa Naa Devaa Nanu Vidanaadithivenduku Chevineeyave Naa Praardhanaku (2) Ani Keka Vesaavaa Shikshananubhavisthu (2) Paraloka Maargam Siddhamu Chesthu (2) ||Parishuddhathalo|| Sarva Srushtikarthanu Ne Dappigonuchuntini Vaakyamu Neraverchuchuntini (2) Ani Sathyamu Thelipaavaa Kannulu Therachutaku (2) Jeeva Jalamunu Anugrahinchutaku (2) ||Parishuddhathalo|| Samaapthmayyindi Loka Vimochana Kaaryam Neraverenu Ghana Sankalpam (2) Ani Prakatana Chesaavaa Kalvari Giri Nunchi (2) Pani Muginchi Nee Thandrini Ghanaparachi (2) ||Parishuddhathalo|| Naa Aathmanu Nee Chethiki Appaginchuchuntini Nee Yoddaku Vachchuchuntini (2) Ani Vinnavinchaavaa Vidheyatha Thoti (2) Thala Vanchi Thrupthiga Vijayamu Chaati (2) ||Parishuddhathalo||