దైవదాసులారా మీరు దీక్షతోడ - YouWorship
Daivadaasulaaraa Meeru Deekshathoda
Artist: సీయోను గీతాలు
Category: Encouraging
Song Lyrics
పల్లవి: దైవదాసులారా మీరు దీక్షతోడ రారండి ప్రభు క్రీస్తుని నిజ సేవకులారా 1. నిత్యుడగు క్రీస్తు ప్రభువు - సత్యసంఘమును గూర్చి యిచ్చినట్టి దర్శనమందు - కట్టబడగ రండి 2. లేవీయుల పరిచర్యల - వివరము నెరిగియుండి సేవకుల పరిచర్యలను- వలదను వారు ప్రబల 3. క్రీస్తుయేసు రక్తమిచ్చి - కొన్నట్టి సంఘమందు అపోస్తులులు అధికారమందు ప్రభువును సేవించెదము 4. దేవుని ఎదుట యోగ్యునిగాను - సిగ్గుపడనక్కరలేని పనివానిగా కనుపరచుకొనను - జాగ్రత్త పడవలెను 5. యిర్మియా, జెరుబ్బాబేలు - ఎజ్రా, నెహెమ్యా ల ధీరతన్ జూచి భీతిని వీడుము - స్తెఫను, పౌలు ల వలెను 6. వాడబారని మహిమ కిరీట - మివ్వను వచ్చుచున్న ప్రధాన కాపరి రాకడ దినమాయె - శ్రద్ధతో మందను కాయన్ 7. సంఘ దర్శనమొందిన - నిజదైవ దాసులకై సహవాసమందు నేర్పిన సత్యముకై - హల్లెలూయ పాడెదం Pallavi: Daivadaasulaaraa Meeru Deekshathoda Raarandi Prabhu Kreesthuni Nija Sevakulaaraa 1. Nithyudagu Kreesthu Prabhuvu - Sathyasangghamunu Goorchi Yichchinatti Darshanamandu - Kattabadaga Randi 2. Leveeyula Paricharyala - Vivaramu Nerigiyundi Sevakula Paricharyalanu- Valadanu Vaaru Prabala 3. KreesthuYesu Rakthamichchi - Konnatti Sangghamandu Aposthululu Adhikaaramandu Prabhuvunu Sevinchedamu 4. Devuni Eduta Yogyunigaanu - Siggupadanakkaraleni Panivaanigaa Kanuparachukonanu - Jaagraththa Padavalenu 5. Yirmiyaa, Jerubbaabelu - Ejraa, Nehemyaa La Dheerathan Joochi Bheethini Veedumu - Sthephanu, Paulu La Valenu 6. Vaadabaarani Mahima Kireeta - Mivvanu Vachchuchunna Pradhaana Kaapari Raakada Dinamaaye - Shraddhatho Mandanu Kaayan 7. Sanggha Darshanamondina - Nijadaiva Daasulakai Sahavaasamandu Nerpina Sathyamukai - Hallelooya Paadedang