దేవ సంస్తుతి - YouWorship
Deva Samsthuthi Cheyave
Artist: ముంగమూరి దేవదాసు
Category: Praise
Song Lyrics
దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీ-మంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా దేవ సంస్తుతి చేయుమా నా – జీవమా యెహోవా దేవుని పావన నామము నుతించుమా – నా యంతరంగము లో వసించు నో సమస్తమా ||దేవ|| జీవమా, యెహోవా నీకు – జేసిన మేళ్ళన్ మరువకు (2) నీవు చేసిన పాతకంబులను – మన్నించి జబ్బు లేవియున్ లేకుండ జేయును – ఆ కారణముచే ||దేవ|| చావు గోతినుండి నిన్ను – లేవనెత్తి దయను గృపను (2) జీవ కిరీటముగ వేయును – నీ శిరసు మీద జీవ కిరీటముగ వేయును – ఆ కారణముచే ||దేవ|| యవ్వనంబు పక్షిరాజు – యవ్వనంబు వలెనే క్రొత్త (2) యవ్వనంబై వెలయునట్లుగా – మే లిచ్చి నీదు భావమును సంతుష్టిపరచునుగా – ఆ కారణముచే ||దేవ|| ప్రభువు నీతి పనులు చేయును – బాధితులకు న్యాయ మిచ్చున్ (2) విభుండు మార్గము తెలిపె మోషేకు – దన కార్యములను విప్పె నిశ్రాయేలు జనమునకు – ఆ కారణముచే ||దేవ|| అత్యధిక ప్రేమ స్వరూపి-యైన దీర్ఘ శాంతపరుండు (2) నిత్యము వ్యాజ్యంబు చేయడు – ఆ కృపోన్నతుడు నీ పయి నెపుడు కోప ముంచడు – ఆ కారణముచే ||దేవ|| పామరుల మని ప్రత్యుపకార – ప్రతి ఫలంబుల్ పంపలేదు (2) భూమి కన్న నాకాసంబున్న – ఎత్తుండు దైవ ప్రేమ భక్తి జనులయందున – ఆ కారణముచే ||దేవ|| పడమటికి తూర్పెంత ఎడమో – పాపములను మనకు నంత (2) ఎడము కలుగజేసియున్నాడు – మన పాపములను ఎడముగానే చేసియున్నాడు – ఆ కారణముచే ||దేవ|| కొడుకులపై తండ్రి జాలి – పడు విధముగా భక్తిపరుల (2) యెడల జాలి పడును దేవుండు – తన భక్తిపరుల యెడల జాలిపడును దేవుండు – ఆ కారణముచే ||దేవ|| మనము నిర్మితమయిన రీతి – తనకు దెలిసియున్న సంగతి (2) మనము మంటి వారమంచును – జ్ఞాపకము చేసి కొనుచు కరుణ జూపుచుండును – ఆ కారణముచే ||దేవ|| పూసి గాలి వీవ నెగిరి – పోయి బసను దెలియని వన (2) వాస పుష్పము వలెనె నరుడుండు – నరు నాయువు తృణ ప్రాయము మన దేవ కృప మెండు – ఆ కారణముచే ||దేవ|| పరమ దేవ నిబంధ నాజ్ఞల్ – భక్తితో గైకొను జనులకు (2) నిరతమును గృప నిలిచి యుండును – యెహోవ నీతి తరములు పిల్లలకు నుండును – ఆ కారణముచే ||దేవ|| Deva Samsthuthi Cheyave Manasaa Sree-manthudagu Yehova Samsthuthi Cheyave Manasaa Deva Samsthuthi Cheyumaa Naa – Jeevama Yehovaa Devuni Paavana Namaamu Nuthinchumaa – Naa Yantharangamu lo Vasinchu No Samasthamaa ||Deva|| Jeevamaa, Yehovaa Neeku – Jesina Mellan Maruvaku (2) Neevu Chesina Paathakambulanu – Manninchi Jabbu Leviyun Lekunda Jeyunu – Aa Kaaranamuche ||Deva|| Chaavu Gothinundi Ninnu – Levanetthi Dayanu Grupanu (2) Jeeva Kireetamuga Veyunu – Nee Shirasu Meeda Jeeva Kireetamuga Veyunu – Aa Kaaranamuche ||Deva|| Yavanambu Pakshiraaju – Yavanambu Valene Krottha (2) Yavanambai Velayunatlugaa – Me Lichchi Needu Bhaavamunu Santhushtiparachunugaa – Aa Kaaranamuche ||Deva|| Prabhuvu Neethi Panulu Cheyun – Baadhithulaku Nyaaya Michchun (2) Vibhundu Maargamu Thelipe Mosheku – Dana Kaaryamulanu Vippe Nishraayelu Janamunaku – Aa Kaaranamuche ||Deva|| Athyadhika Prema Swaroopi-Yaina Deergha Shaanthaparundu (2) Nithyamu Vyaajyambu Cheyadu – Aa Kruponnathudu Nee Payi Nepudu Kopa Munchadu – Aa Kaaranamuche ||Deva|| Paamarula Mani Prathyupakaara – Prathi Phalambul Pampaledu (2) Bhoomi Kanna Naakasambunna – Yetthundu Daiva Prema Bhakthi Janulayanduna – Aa Kaaranamuche ||Deva|| Padamatiki Thoorpentha Yedamo – Paapamulakunu Manaku Nanatha (2) Yedamu Kalugajesiyunnaadu – Mana Paapamulanu Edamugaane Chesiyunnaadu – Aa Kaaranamuche ||Deva|| Kodukulapai Thandri Jaali – Padu Vidhamugaa Bhakthiparula (2) Yedala Jaali Padunu Devundu – Thana Bhakthiparula Yedala Jaalipadunu Devundu – Aa Kaaranamuche ||Deva|| Manamu Nirmithamayina Reethi – Thanaku Delisiyunna Sangathi (2) Manamu Manti Vaaramanchunu – Gnaapakamu Chesi Konuchu Karuna Joopuchundunu – Aa Kaaranamuche ||Deva|| Poosi Gaali Veeva Negiri – Poyi Basanu Deliyani Vana (2) Vaasa Pushpamu Valene Narudundu – Naru Naayuvu Thruna Praayamu Mana Deva Krupa Mendu – Aa Kaaranamuche ||Deva|| Parama Deva Nibandha Naagnal – Bhakthitho Gaikonu Janulaku (2) Nirathamunu Grupa Nilichi Yundunu – Yehova Neethi Tharamulu Pillalaku Nundunu – Aa Kaaranamuche ||Deva||