దేవ దాసపాలక - YouWorship
Deva Daasapaalaka
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
దేవ దాసపాలక రాజా రావే జీవముల ప్రదాతవై ప్రకాశ మొందగా దేవా దేవా దీన పోషకా ||దేవ|| లోక బాధ ఇరుకు శోధన నుండి స్వీకరించినావు త్రియేక దేవుడా స్తోత్రం స్తోత్రం స్తోత్రమర్పణ ||దేవ|| దిక్కులేని పాపి కొరకు నీ దేహం మిక్కుటంపు బాధ కొప్పితివి యక్కటా జయం జయం జయము నొందగా ||దేవ|| కఠినులంత కుటిలము జేసి నిన్ను గట్టి కొట్టి నెట్టి నీకు గొయ్య నెత్తిరా యిదే నా యెడ బ్రేమ జూపితి ||దేవ|| ఇంత యొర్పు యింత శాంతమా నాకై పంతముతో బాపికొరకు బ్రాణమియ్యగా పాపి నీదగు దాపు జేర్చవే ||దేవ|| కలువరి గిరి వరంబున నాకై తులువను నా కొరకు నిలను సిల్వ మోయగా హల్లెలూయా హల్లెలూయ హల్లెలూయ ఆమెన్ ||దేవ|| Deva Daasapaalaka Raajaa Raave Jeevamula Pradaathavai Prakaasha Mondagaa Devaa Devaa Deena Poshakaa ||Deva|| Loka Baadha Iruku Shodhana Nundi Sweekarinchinaavu Thriyeka Devudaa Sthothram Sthothram Sthothramarpana ||Deva|| Dikkuleni Paapi Koraku Nee Deham Mikkutampu Baadha Koppithivi Yakkataa Jayam Jayam Jayamu Nondagaa ||Deva|| Katinulantha Kutilamu Jesi Ninnu Gatti Kotti Netti Neeku Goyya Netthiraa Yide Naa Yeda Brema Joopithi ||Deva|| Intha Yorpu Yintha Shaanthamaa Naakai Panthamutho Baapikoraku Braanamiyyagaa Paapin Needagu Daapu Jerchave ||Deva|| Kaluvari Giri Varambuna Naakai Thuluvanu Naa Koraku Nilanu Silva Moyagaa Halelooyaa Halelooya Halelooya Aamen ||Deva||