దేవ గొర్రెపిల్ల సిలువలో సమసినపుడు - YouWorship
Deva Gorrepilla Siluvalo Samasinapudu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: రక్తమందు రక్తమందు - పాపి నీవు ఆ రక్తమందు నిలిచియున్నావా? (1) రక్తమందు రక్తమందు - ఇపుడు విడుదలను కోరి పొందెదవా? (1) 1. దేవ గొర్రెపిల్ల సిలువలో సమసినపుడు పాప పరిహారార్థ ఊట తెరచెన్ (1) పాపి నీవు ఆరక్తమందు నిలచియున్నావా! ఇపుడు విడుదలను కోరి పొందెదవా! (1) 2. అపవిత్రుడైనను అక్రమస్తుడైనను ఆ పవిత్రరక్తము శుద్ధిచేయును ఏలు పాపమైనను - అతిక్రమమైనను ఏలికచే మన్నింపబడి యున్నావా? || రక్త || 3. ప్రియులారా యను ప్రభుని పిల్పు వింటివా? మాయవేషమంతయు - వీడియున్నావా? పాప బంధము లింక నిన్ను కట్టియున్నవా? శాపలోకముపై జయ మొందుచున్నావా? || రక్త || 4. ఆత్మజీవ శరీరంబుల నర్పించితివా? అల్పవిషయములోను సత్యమున్నదా? నాడు మరణించిన యేసులేచియున్నాడు నేడుయేసున్ చేరిన యభయ మిచ్చును || రక్త || 5. పంచఖండములను రక్షించుట కొరకు పంచగాయ మొందిన ప్రభుని చూడుమా ఇంచుకైన త్రోయడు డాసినట్టి వారల మించు సత్యములను కోరి వెదకుము || రక్త || 6. రేపు రేపు యనుట నమ్మిక కానేరదు మాపు మరణించిన నెచటి కేగుదువు? ప్రాపకుండగు యేసుని చిత్తమును జరిపిన శ్రీ పాలుండు నిన్నుత్తముండని మెచ్చును || రక్త || 7. హల్లెలూయా పాడుము శక్తిగల యేసుకు కల్ల కార్యములను విడచివేయుము చెల్లచెదరగును కష్టము లచ్చోటను కొల్లగా ననుభవింతువు సుఖంబును || రక్త || Pallavi: Rakthamandu Rakthamandu - Paapi Neevu Aa Rakthamandu Nilichiyunnaavaa? (1) Rakthamandu Rakthamandu - Ipudu Vidudalanu Kori Pondedavaa? (1) 1. Deva Gorrepilla Siluvalo Samasinapudu Paapa Parihaaraartha Oota Therachen (1) Paapi Neevu Aarakthamandu Nilachiyunnaavaa! Ipudu Vidudalanu Kori Pondedavaa! (1) 2. Apavithrudainanu Akramasthudainanu Aa Pavithrarakthamu Shuddhicheyunu Elu Paapamainanu - Athikramamainanu Elikache Mannimpabadi Yunnaavaa? || Raktha || 3. Priyulaaraa Yanu Prabhuni Pilpu Vintivaa? Maayaveshamanthayu - Veediyunnaavaa? Paapa Bandhamu Lingka Ninnu Kattiyunnavaa? Shaapalokamupai Jaya Monduchunnaavaa? || Raktha || 4. Aathmajeeva Shareerambula Narpinchithivaa? Alpavishayamulonu Sathyamunnadaa? Naadu Maraninchina Yesulechiyunnaadu NeduYesun Cherina Yabhaya Michchunu || Raktha || 5. Panchakhandamulanu Rakshinchuta Koraku Panchagaaya Mondina Prabhuni Choodumaa Inchukaina Throyadu Daasinatti Vaarala Minchu Sathyamulanu Kori Vedakumu || Raktha || 6. Repu Repu Yanuta Nammika Kaaneradu Maapu Maraninchina Nechati Keguduvu? Praapakundagu Yesuni Chiththamunu Jaripina Shree Paalundu Ninnuththamundani Mechchunu || Raktha || 7. Hallelooyaa Paadumu Shakthigala Yesuku Kalla Kaaryamulanu Vidachiveyumu Chellachedaragunu Kashtamu Lachchotanu Kollagaa Nanubhavinthuvu Sukhambunu || Raktha ||