దేవుని స్తుతించ రండి - YouWorship
Devuni Sthuthincha Randi
Artist: Unknown Artist
Category: Thanksgiving
Song Lyrics
దేవుని స్తుతించ రండి గత సంవత్సరమున కాపాడెన్ కీడు మనలను చేరకను – కోటి కీడుల నుండి కాపాడినట్టి – మహా ||దేవుని|| కోట్లకొలది మరణించిరి మన మిచ్చట చేరియున్నాము కష్టముల బాపి మనల నింక జగమున జీవితులుగా నుంచినట్టి – మహా ||దేవుని|| ఎన్ని కీడుల మనము చేసిన నన్ని మెల్లను చేసెనుగా నిరతము కాచి చక్కగాను ప్రభు ప్రేమతో కాచినందున స్తుతిచేసి ||దేవుని|| ఏకముగా పాడి హర్షముతో లెక్కలేని మేలులకై ఆత్మ దేహములను బలిగా నిపుడేసు కర్పించెద మేకముగా – చేరి ||దేవుని|| వత్సారంభముననిను మే మొక్కటిగా నారాధింప దైవ కుమారా కృపనిమ్ము మా జీవిత కాలమంతయు పాడి – మహా ||దేవుని|| భూమి యందలి మాయల నుండి సైతానుని వలలో నుండి ఆత్మతో నిను సేవింప నిపు డేలుమనుచు బ్రతిమాలెదము – కూడి ||దేవుని||| ప్రతి సంవత్సరమును మము జూడుము దుర్గములో మము చేర్చుమయ్యా దాటునప్పుడు నీ సన్నిధిని – చూపి ధైర్యమునిచ్చి ఓదార్చుమయ్యా – మహా ||దేవుని|| స్తోత్రింతుము ప్రభువా నీ పదముల సకలాశీర్వాదముల నిమ్ము ప్రేమతో ప్రభుతో నుండ నెట్టి యాపద లేక బ్రోవుమామెన్ – ప్రభు ||దేవుని|| Devuni Sthuthincha Randi Gatha Samvathsaramuna Kaapaaden Keedu Manalanu Cherakanu – Koti Keedula Nundi Kaapaadinatti – Mahaa ||Devuni|| Kotlakoladi Maraninchiri Mana Michchata Cheriyunnaamu Kashtamula Baapi Manala Ninka Jagamuna Jeevithuluga Nunchinatti – Mahaa ||Devuni|| Enni Keedula Manamu Chesina Nanni Mellanu Chesenugaa Nirathamu Kaachi Chakkaganu Prabhu Prematho Kaachinanduna Sthuthichesi ||Devuni|| Ekamugaa Paadi Harshamutho Lekkaleni Melulakai Aathma Dehamulanu Baliga Nipudesu Karpincheda Mekamugaa – Cheri ||Devuni|| Vathsaarambhamunaninu Me Mokkatigaa Naaraadhimpa Daiva Kumaaraa Krupanimmu Maa Jeevitha Kaalamanthayu Paadi – Mahaa ||Devuni|| Bhoomi Yandali Maayala Nundi Saithaanuni Valalo Nundi Aathmatho Ninu Sevimpa Nipu Delumanuchu Brathimaaledamu – Koodi ||Devuni|| Prathi Samvathsaramunu Mamu Joodumu Durgamulo Mamu Cherchumayyaa Daatunappudu Nee Sannidhini – Choopi Dhairyamunichchi Odaarchumayyaa – Mahaa ||Devuni|| Sthothrinthumu Prabhuvaa Nee Padamula Sakalaasheervaadamula Nimmu Prematho Prabhutho Nunda Netti Yaapada Leka Brovumaamen – Prabhu ||Devuni||