దేవుని మహిమ మందిరం - YouWorship
Devuni Mahima Mandirang
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: దేవుని మహిమ మందిరం (2) - యాజకుల ఆరాధనాలయం (2) 1. అదియే మోరియా గొల్గొతాకొండయు - ఇస్సాకు బల్యర్పణ స్థలమును (2) యెబూసీ యెరూషలేమదే (2) 2. యాకోబు బలిష్టుని నివాసమదియే - ఆ స్థలమెంతో భీతి గొల్పునది (2) పరలోకపు గవినీయదే (2) 3. సీనాయి కొండపై మోషేకు చూపిన - పరలోక ప్రత్యక్షపు గుడారమదియే అగ్నివంటి ఆకారమున్న స్థలమదే 4. దావీదు దేవుని గుడారమదియే - తేజోమహిమ నిలుచు నివాసము ప్రభుని ప్రతిష్ఠిత పర్వతమదియే 5. యెహోవా పట్టణము పాదపీఠ స్థలము ఇశ్రాయేలు పరిశుద్ధుని సీయోనదియే చిగురు మహిమ భూషణమగునచట 6. సజీవరాళ్ళతో నిర్మించబడుచున్న యేసుని మానస మందిరమదియే పెండ్లికుమార్తె సంఘము అదియే 7. కలహించుట మాని కలిసి వెళ్ళుదము హెబ్రోను దేవుని మహిమ మందిరముకు మన దుఃఖ దినములు సమాప్తమగును 8. మునుపటి మహిమను మించిన మహిమతో పరలోకము నుండి దిగి వచ్చుచున్న నూతన యెరూషలేమదే Pallavi: Devuni Mahima Mandiran (2) - Yaajakula Aaraadhanaalayan (2) 1. Adiye Moriyaa Golgothaakondayu - Issaaku Balyarpana Sthalamunu (2) Yeboosee Yerooshalemade (2) 2. Yaakobu Balishtuni Nivaasamadiye - Aa Sthalamentho Bheethi Golpunadi (2) Paralokapu Gavineeyade (2) 3. Seenaayi Kondapai Mosheku Choopina - Paraloka Prathyakshapu Gudaaramadiye Agnivanti Aakaaramunna Sthalamade 4. Daaveedu Devuni Gudaaramadiye - Thejomahima Niluchu Nivaasamu Prabhuni Prathishthitha Parvathamadiye 5. Yehovaa Pattanamu Paadapeetha Sthalamu Ishraayelu Parishuddhani Seeyonadiye Chiguru Mahima Bhooshanamagunachata 6. Sajeevaraallatho Nirminchabaduchunna Yesuni Maanasa Mandiramadiye Pendlikumaarthe Sangghamu Adiye 7. Kalahinchuta Maani Kalisi Velludamu Hebronu Devuni Mahima Mandiramuku Mana Duhkha Dinamulu Samaapthamagunu 8. Munupati Mahimanu Minchina Mahimatho Paralokamu Nundi Digi Vachchuchunna Noothana Yerooshalemade