దేవుని ప్రార్థించెదము దైవ పుత్రుని నామమందు - YouWorship
Devuni Praarthinchedamu Daiva Puthruni Naamamandu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: దేవుని ప్రార్థించెదము - దైవ పుత్రుని నామమందు (2) 1. అడుగుడి మీకు నిత్తుననెన్ - వెదకుడి మీకు దొరకుదును (2) మదిని నమ్మి మీరు తట్టినచో (2) ముదమున తలుపు తీయుదుననె (1) 2. గూఢమైన - సంగతులిలన్ గాఢమై - నీవు - గ్రహింపలేని వేడిన పొందెద విలలో దండిగ దాని యేలు పొందెనహా 3. ఇదివరకు మీరేమిలయున్ - నాదు పేరట అడుగ లేదనెన్ మీదు సంతోషము ఇలలో అధికమగును పొందిరి శిష్యులు 4. మనలో కార్య సాధకమైన తనశక్తి - చొప్పున క్రీస్తు చేయున్ మనమడిగినవాటి కంటే ఎంతో ఘనముగా చెరలో పౌలు పేతురు గాంచె 5. ఊహించువా టన్నిటి కంటె - సాహసకార్య ములు ఎన్నో ఊహకు మించె నగ్నిగుండములో ఆహాహా నలుగురు తిరుగుచునుండిరి 6. నా నిమిత్తము జనులు నిన్ను - కాని మాటలెల్ల పలుకునపుడు నిన్ను శపించి హింసించిన కన్నులెత్తి ప్రార్థించి దీవించుమనె 7. నిశ్చయముగా నేను నిన్ను - ఆశీర్వదింతు నని పల్కె నిశ్చయముగ నభివృద్ది జేసి శాశ్వతముగా తోడై యుందు ననే 8. ఎన్ని శోధనలు - వచ్చిన పెన్నుగా - ప్రార్ధించు ప్రభుని కన్నతండ్రి నిన్ను విడువడు సన్నుతించి పాడు హల్లెలూయా Pallavi: Devuni Praarthinchedamu - Daiva Puthruni Naamamandu (2) 1. Adugudi Meeku Niththunanen - Vedakudi Meeku Dorakudunu (2) Madini Nammi Meeru Thattinacho (2) Mudamuna Thalupu Theeyudunane (1) 2. Goodhamaina - Sanggathulilan Gaadhamai - Neevu - Grahimpaleni Vedina Pondeda Vilalo Dandiga Daani Yelu Pondenahaa 3. Idivaraku Meeremilayun - Naadu Perata Aduga Ledanen Meedu Santhoshamu Ilalo Adhikamagunu Pondiri Shishyulu 4. Manalo Kaarya Saadhakamaina Thanashakthi - Choppuna Kreesthu Cheyun Manamadiginavaati Kante Entho Ghanamugaa Cheralo Paulu Pethuru Gaanche 5. Oohinchuvaa Tanniti Kante - Saahasakaarya Mulu Enno Oohaku Minche Nagnigundamulo Aahaahaa Naluguru Thiruguchunundiri 6. Naa Nimiththamu Janulu Ninnu - Kaani Maatalella Palukunapudu Ninnu Shapinchi Hinsinchina Kannuleththi Praarthinchi Deevinchumane 7. Nishchayamugaa Nenu Ninnu - Aasheervadinthu Nani Palke Nishchayamuga Nabhivruddi Jesi Shaashvathamugaa Thodai Yundu Nane 8. Enni Shodhanalu - Vachchina Pennugaa - Praardhinchu Prabhuni Kannathandri Ninnu Viduvadu Sannuthinchi Paadu Hallelooyaa