దేవుని కృప నిత్యముండును - YouWorship
Devuni Krupa Nithyamundunu
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
పల్లవి: దేవునికృప నిత్యముండును - ఆయన కృప నిత్యముండును - స్తోత్రముచేసి స్తుతించి పాడి - హల్లెలూయా ఆర్భాటింతుము (2) 1. ఇరుకునందు నశింపకుండ - ఇంత వరకు కాచె మమ్ము (2) ఎంతో ఉత్తముడాయన ఉన్నతుడు - ఆయన కృప నిత్యముండను (2) 2. శత్రు సేనలు చుట్టుముట్టిన - దావీదు భక్తునిగాచిన దేవుడు ముందు నడచును ఆయన బలవంతుడు - ఆయన కృప నిత్యముండును 3. అగ్నిశోధన మనకు కలిగిన - ఆదరించి విజయమిచ్చి ఆర్భాటముతో మమ్ము నడిపించును - ఆయన కృప నిత్యముండును 4. గాఢాంధాకార లోయలో నడచిన - నా పాదములకు దీపమై యుండి నన్ను నడుపును ఆయనే ఎల్లప్పుడు - ఆయన కృప నిత్యముండును 5. నీచులెందరో అపహసించిన - నెహెమ్యాకు తన ఆత్మనొసగె నిరతము మనకు ధైర్యము నిచ్చు - ఆయన కృప నిత్యముండును 6. నిత్యదేవుడు సత్యవంతుడు - నిత్యము మనకు జయమునిచ్చి ఉత్సాహముగా మము నడిపించెను - ఆయన కృప నిత్యముండును Pallavi: DevuniKrupa Nithyamundunu - Aayana Krupa Nithyamundunu - Sthothramuchesi Sthuthinchi Paadi - Hallelooyaa Aarbhaatinthumu (2) 1. Irukunandu Nashimpakunda - Intha Varaku Kaache Mammu (2) Entho Uththamudaayana Unnathudu - Aayana Krupa Nithyamundanu (2) 2. Shathru Senalu Chuttumuttina - Daaveedu Bhakthunigaachina Devudu Mundu Nadachunu Aayana Balavanthudu - Aayana Krupa Nithyamundunu 3. Agnishodhana Manaku Kaligina - Aadarinchi Vijayamichchi Aarbhaatamutho Mammu Nadipinchunu - Aayana Krupa Nithyamundunu 4. Gaadhaandhaakaara Loyalo Nadachina - Naa Paadamulaku Deepamai Yundi Nannu Nadupunu Aayane Ellappudu - Aayana Krupa Nithyamundunu 5. Neechulendaro Apahasinchina - Nehemyaaku Thana Aathmanosage Nirathamu Manaku Dhairyamu Nichchu - Aayana Krupa Nithyamundunu 6. NithyaDevudu Sathyavanthudu - Nithyamu Manaku Jayamunichchi Uthsaahamugaa Mamu Nadipinchenu - Aayana Krupa Nithyamundunu