దేవుని కీర్తించెదము దైవపుత్రుని నామమందు - YouWorship
Devuni Keerthinchedamu Daivaputhruni Naamamandu
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
పల్లవి: దేవుని కీర్తించెదము - దైవపుత్రుని నామమందు (2) 1. యోసేపుపై దృష్టినుంచి మోసపు చెరనుండి గాచి (2) యేసునం దైగుప్తు నుండి (2) క్రీస్తునందరిని గాచిన (1) 2. పాప ఋణముచేత నిత్య - కోపమునకు గురియైతిమి శాపగ్రాహియై శ్రీ యేసు - పాప ఋణము తీర్చినాడు 3. మార్గ సత్య జీవమై నిత్య - మరణ భయము లేనివాడు మరణ బంధితులను గావ - మరణమొంది లేచినాడు 4. నీతిమంతుడైన యేసు - నీతి కార్యములను జేసి నీతి నిలయుండై తండ్రి నిల - నీతితోనే తృప్తిపరచెన్ 5. యేడ్చెను మన పాపములకై - కార్చెను తనరక్తము నిల ఓర్చెను తన శత్రువులను - గెల్చెను తన సిలువలోనే 6. లేదు నీకు భయము చింత - లేదు నమ్మి నిలచినచో నీదు స్వాస్థ్యమంత తిరిగి - నాథుడేసులో పొందగలవు 7. జయము పాడు ప్రియుడ లేచి - జయ జీవితము నొంది వేగ జయశీలుండు కీస్తు యేసుని - జయము పాడు హల్లెలూయ Pallavi: Devuni Keerthinchedamu - Daivaputhruni Naamamandu (2) 1. Yosepupai Drushtinunchi Mosapu Cheranundi Gaachi (2) Yesunan Daigupthu Nundi (2) Kreesthunandarini Gaachina (1) 2. Paapa Runamuchetha Nithya - Kopamunaku Guriyaithimi Shaapagraahiyai Shree Yesu - Paapa Runamu Theerchinaadu 3. Maarga Sathya Jeevamai Nithya - Marana Bhayamu Lenivaadu Marana Bandhithulanu Gaava - Maranamondi Lechinaadu 4. Neethimanthudaina Yesu - Neethi Kaaryamulanu Jesi Neethi Nilayundai Thandri Nila - Neethithone Thrupthiparachen 5. Yedchenu Mana Paapamulakai - Kaarchenu Thanarakthamu Nila Orchenu Thana Shathruvulanu - Gelchenu Thana Siluvalone 6. Ledu Neeku Bhayamu Chintha - Ledu Nammi Nilachinacho Needu Svaasthyamantha Thirigi - Naathudesulo Pondagalavu 7. Jayamu Paadu Priyuda Lechi - Jaya Jeevithamu Nondi Vega Jayasheelundu Keesthu Yesuni - Jayamu Paadu Hallelooya