దేవునికి స్తోత్రము గానము - YouWorship
Devuniki Sthothramu Gaanamu
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతిగానము చేయుటయే మంచిది యెరుషలేము యెహోవాయే కట్టుచున్నవాడని ఇశ్రయేలీయులను పోగుచేయువాడని ||దేవునికి|| గుండె చెదరిన వారిని బాగుచేయువాడని వారి గాయములన్నియు కట్టుచున్నవాడని ||దేవునికి|| నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించును వాటికన్నియు పేరులు పెట్టుచున్నవాడని ||దేవునికి|| ప్రభువు గొప్పవాడును అధిక శక్తి సంపన్నుడు జ్ఞానమునకు ఆయనే మితియు లేనివాడని ||దేవునికి|| దీనులకు అండాయెనే భక్తిహీనుల కూల్చును సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి ||దేవునికి|| ఆయన ఆకాశమున్ మేఘములతో కప్పును భూమికొరకు వర్షము సిద్ధపరచువాడని ||దేవునికి|| పర్వతములలో గడ్డిని పశువులకు మొలపించెను అరచు పిల్లకాకులకును ఆహారము తానీయును ||దేవునికి|| గుర్రముల నరులందలి బలము నానందించడు కృప వేడు వారిలో సంతసించువాడని ||దేవునికి|| యెరుషలేము యెహోవను సీయోను నీ దేవుని కీర్తించుము కొనియాడుము ఆనందించువాడని ||దేవునికి|| పిల్లల నాశీర్వదించియు బలపరచు నీ గుమ్మముల్ మంచి గోధుమపంటతో నిన్ను తృప్తిగనుంచును ||దేవునికి|| భూమికి తనయాజ్ఞను ఇచ్చువాడు ఆయనే వేగముగను దేవుని వాక్యము పరుగెత్తును ||దేవునికి|| వాక్యమును యాకోబుకు తెలియచేసినవాడని ఏ జనముకీలాగున చేసియుండలేదని ||దేవునికి|| Devuniki Sthothramu Gaanamu Cheyutaye Manchidi Manamandaramu Sthuthigaanamu Cheyutaye Manchidi Yerushalemu Yehovaye Kattuchunnavaadani Ishrayeleeyulanu Pogucheyuvaadani ||Devuniki|| Gunde Chedarina Vaarini Baagucheyuvaadani Vaari Gaayamulanniyu Kattuchunnavaadani ||Devuniki|| Nakshathramula Sankhyanu Aayane Niyaminchunu Vaatikanniyu Perulu Pettuchunnavaadani ||Devuniki|| Prabhuvu Goppavaadunu Adhika Shakthi Sampannudu Gnaanamunaku Aayane Mithiyu Lenivaadani ||Devuniki|| Deenulaku Andaayene Bhakthiheenula Koolchunu Sithaaraatho Devuni Sthuthulatho Keerthinchudi ||Devuniki|| Aayana Aakaashamun Meghamulatho Kappunu Bhoomikoraku Varshamu Sidhdhaparachuvaadani ||Devuniki|| Parvathamulalo Gaddini Pashuvulaku Molapinchenu Arachu Pillakaakulakunu Aahaaramu Thaaneeyunu ||Devuniki|| Gurramula Narulandali Balamu Naanandinchadu Krupa Vedu Vaarilo Santhasinchuvaadani ||Devuniki|| Yerushalemu Yehovaanu Seeyonu Nee Devuni Keerthinchumu Koniyaadumu Aanandinchuvaadani ||Devuniki|| Pillala Naasheervadinchiyu Balaparachu Nee Gummamul Manchi Godhumapantatho Ninnu Thrupthiganunchunu ||Devuniki|| Bhoomiki Thanayaagnanu Ichchuvaadu Aayane Vegamugamu Devuni Vaakyamu Parugeththunu ||Devuniki|| Vaakyamunu Yaakobuku Theliyachesinavaadani Ae Janamukeelaaguna Chesiyundaledani ||Devuniki||