దేవునికి మొఱ్ఱపెట్టుదును ఎలుగెత్తి - YouWorship
Devuniki Morrapettudunu Elugeththi
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
1. దేవునికి మొఱ్ఱపెట్టుదును ఎలుగెత్తి (2) చెవి యొగ్గు వరకు మనవి చేయుచుందును (2) 2. ప్రభుని ఆపదల యందు వెదకువాడను ప్రాణము పొంద జాలకున్నది యోదార్పును 3. దేవుని దలచి నిట్టూర్పు విడుచుచున్నాను ధ్యానించు నపుడు ఆత్మ కృంగిపోవుచున్నది 4. మూత పడనియ్యవు నీవు నాదు కన్నులు మాటాడజాలనైతి నేను కలవరపడి 5. పూర్వ సంవత్సరములను తలచుకొందును పాడిన పాట రాత్రి జ్ఞప్తినుంచుకొందును 6. హృదయమున నిన్ను ధ్యానించుకొందురు శ్రద్ధగ నా యాత్మ నీ తీర్పు వెదకుచున్నది 7. ప్రభువు నన్ను నిత్యము విడిచిపెట్టునా ప్రభువింకెన్నటికిని కటాక్షముంచడా 8. తన కటాక్ష మెన్నటికిని మానిపోయెనా తరములకు తన మాట తప్పి పోయెనా 9. దేవుడు నన్ను కనికరింపక మానివేసెనా దేవుడు కోపముతో కృప చూపకుండునా? 10. మహోన్నతుని దక్షిణ హస్తము మారెను అనుకొనుటకు నా శ్రమలే కారణము 11. దేవా నీ పూర్వపు ఆశ్చర్యకార్యములను తలంచు కొందు నాదు మనస్సులో నిప్పుడు 12. నీ కార్యమంతటిని ధ్యానించుకొందును నీ క్రియలను ధ్యానము నే జేసికొందును 13. మహా పరిశుద్ధమైనది నీదు మార్గము మహా దేవా నీ వంటివాడు ఎక్కడున్నాడు? 14. ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే జనములలో ప్రభావమును చూపియున్నావు 1. Devuniki Morrapettudunu Elugeththi (2) Chevi Yoggu Varaku Manavi Cheyuchundunu (2) 2. Prabhuni Aapadala Yandu Vedakuvaadanu Praanamu Ponda Jaalakunnadi Yodaarpunu 3. Devuni Dalachi Nittoorpu Viduchuchunnaanu Dhyaaninchu Napudu Aathma Krunggipovuchunnadi 4. Mootha Padaniyyavu Neevu Naadu Kannulu Maataadajaalanaithi Nenu Kalavarapadi 5. Poorva Sanvathsaramulanu Thalachukondunu Paadina Paata Raathri Gnapthinunchukondunu 6. Hrudayamuna Ninnu Dhyaaninchukonduru Shraddhaga Naa Yaathma Nee Theerpu Vedakuchunnadi 7. Prabhuvu Nannu Nithyamu Vidichipettunaa Prabhuvingkennatikini Kataakshamunchadaa 8. Thana Kataaksha Mennatikini Maanipoyenaa Tharamulaku Thana Maata Thappi Poyenaa 9. Devudu Nannu Kanikarimpaka Maanivesenaa Devudu Kopamutho Krupa Choopakundunaa? 10. Mahonnathuni Dakshina Hasthamu Maarenu Anukonutaku Naa Shramale Kaaranamu 11. Devaa Nee Poorvapu Aashcharyakaaryamulanu Thalanchu Kondu Naadu Manassulo Nippudu 12. Nee Kaaryamanthatini Dhyaaninchukondunu Nee Kriyalanu Dhyaanamu Ne Jesikondunu 13. Mahaa Parishuddhamainadi Needu Maargamu Mahaa Devaa Nee Vantivaadu Ekkadunnaadu? 14. Aashcharya Kriyalu Jariginchu Devudavu Neeve Janamulalo Prabhaavamunu Choopiyunnaavu