దేవుడే ఇల చేరేటందుకు - YouWorship
Devude Ila Cheretanduku
Artist: సాయారం గట్టు
Category: Comfort
Song Lyrics
దేవుడే ఇల చేరేటందుకు ఎన్నుకున్న మార్గం అమ్మా అంటూ పిలుచుకొని పొందుకొనెను జన్మం నీకంటూ ఏది లేదన్నట్లు ఎందుకంత త్యాగం కనరాని ప్రేమకు నీవేగా కదలాడుతున్న రూపం (2) అమ్మా నీ ఋణమును తీర్చే సిరులు లేవు ఇలలో ఆ దైవము సైతము నేర్చె పాఠాలు చల్లని నీ ఒడిలో (2) ||దేవుడే|| కన్న బిడ్డను పరాయి బిడ్డగా పెంచుకున్న మమకారం తన ప్రజల విముక్తికి దేవుడు చేసిన కార్యంలో సహకారం (2) మోషేగా మారిన పసివాడిని దాసిగా పెంచిన కన్నతల్లి సుగుణం (2) దాసిగా పెంచిన కన్నతల్లి సుగుణం ||అమ్మా|| సంతతి లేక సవతి పోరుతో విసిగినట్టి దీనత్వం దేవుని సన్నిధి హృదయము పరచి పొందుకొనెను మాతృత్వం (2) హన్నా చేసిన ఆ త్యాగమే కాదా సమూయేలు పొందిన న్యాయాధిపత్యము (2) సమూయేలు పొందిన న్యాయాధిపత్యము ||అమ్మా|| కొన ఊపిరితో సిలువపైన వేళాడుతున్న క్షణము ఆ దేవ దేవుడు తీర్చుకొనెను తన మాతృమూర్తి ఋణము (2) ప్రియ శిష్యుని దరికి తల్లిని చేర్చి నెరవేర్చెను ఇలలో తనయుడిగా ధర్మం (2) నెరవేర్చెను ఇలలో తనయుడిగా ధర్మం ||అమ్మా|| Devude Ila Cheretanduku Ennukunna Maargam Ammaa Antu Piluchukoni Pondukonenu Janmam Neekantu Edi Ledannatlu Endukantha Thyaagam Kanaraani Premaku Neevegaa Kadalaaduthunna Roopam (2) Ammaa Nee Runamunu Theerche Sirulu Levu Ilalo Aa Daivamu Saithamu Nerche Paataalu Challani Nee Odilo (2) ||Devude|| Kanna Biddanu Paraayi Biddagaa Penchukunna Mamakaaram Thana Prajala Vinukthiki Devudu Chesina Kaaryamlo Sahakaaram (2) Moshegaa Maarina Pasivaadini Daasigaa Penchina Kannathalli Sugunam (2) Daasigaa Penchina Kannathalli Sugunam ||Ammaa|| Santhathi Leka Savathi Porutho Visiginatti Deenathvam Devuni Sannidhi Hrudayamu Parachi Pondukonenu Maathruthvam (2) Hannaa Chesina Aa Thyaagame Kaadaa Samooyelu Pondina Nyaayaadhipathyamu (2) Samooyelu Pondina Nyaayaadhipathyamu ||Ammaa|| Kona Oopiritho Siluvapaina Velaaduthunna Kshanamu Aa Deva Devudu Theerchukonenu Thana Maathrumoorthy Runamu (2) Priya Shishyuni Dariki Thallini Cherchi Neraverchenu Ilalo Thanayudigaa Dharmam (2) Neraverchenu Ilalo Thanayudigaa Dharmam ||Ammaa||