దేవుడు మనలను ఏర్పరచుకొన్నాడు - YouWorship
Devudu Manalanu Erparachukonnaadu
Artist: సీయోను గీతాలు
Category: Commitment
Song Lyrics
పల్లవి: దేవుడు మనలను ఏర్పరచుకొన్నాడు ధూపంబు వేయుటకు - పరిచర్య చేయుటకు అలక్ష్యము చేయకుమా - దేవుని సేవను అశ్రద్ధ చేయకుమా (2) 1. యెరూషలేము ఎడారియాయెను - యూదా దేశము దిగంబరియాయెను ద్రాక్షావనములు పాడైపోయెను అయినను దేవుడు కృప చూపుచుండగా 2. విధేయులైయుండుడి క్రీస్తు దాసులారా - దేవుని చిత్తమును యిలలో జరిగించుచు చేయుడి ప్రభువుకు - యింపైన సేవ భయముతో వణకుతో ప్రియుడైన యేసుకు 3. ప్రతిష్ఠించుకొనుడి - మిమ్ము ఓ యాజకులారా - అపోస్తులులు - ప్రవక్తలు - ఓ పెద్దలారా బాగుచేసికొనుడి - మీ బలిపీఠంబులను తరుణమిచ్చి యుండగా - తప్పుదిద్దుకొందమా 4. వచ్చుచున్నాడేసు - బహుమానము తోడ ప్రతివాని క్రియకు - వాని జీతమిచ్చుటకు సిద్ధపడు జీతము - బహుమానము పొంద కాచుకొమ్ము నీ వంతులో నిలిచి యుండుటకు Pallavi: Devudu Manalanu Erparachukonnaadu Dhoopambu Veyutaku - Paricharya Cheyutaku Alakshyamu Cheyakumaa - Devuni Sevanu Ashraddha Cheyakumaa (2) 1. Yerooshalemu Edaariyaayenu - Yoodaa Deshamu Digambariyaayenu Draakshaavanamulu Paadaipoyenu Ayinanu Devudu Krupa Choopuchundagaa 2. Vidheyulaiyundudi Kreesthu Daasulaaraa - Devuni Chiththamunu Yilalo Jariginchuchu Cheyudi Prabhuvuku - Yimpaina Seva Bhayamutho Vanakutho Priyudaina Yesuku 3. Prathishthinchukonudi - Mimmu O Yaajakulaaraa - Aposthululu - Pravakthalu - O Peddalaaraa Baaguchesikonudi - Mee Balipeethambulanu Tharunamichchi Yundagaa - Thappudiddukondamaa 4. Vachchuchunnaadesu - Bahumaanamu Thoda Prathivaani Kriyaku - Vaani Jeethamichchutaku Siddhapadu Jeethamu - Bahumaanamu Ponda Kaachukommu Nee Vanthulo Nilichi Yundutaku