దేవుడు మనకు ఎల్లప్పుడు - YouWorship
Devudu Manaku Ellappudu
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
దేవుడు మనకు ఎల్లప్పుడు (2) తోడుగ నున్నాడు (3) ఏదేనులో ఆదాముతో నుండెన్ (2) హానోకు తోడనేగెను (2) దీర్ఘ దర్శకులతో నుండెన్ (2) ధన్యులు దేవుని గలవారు – తోడుగనున్నాడు దైవాజ్ఞను శిరసావహించి (2) దివ్యముగ నా బ్రాహాము (2) కన్న కొమరుని ఖండించుటకు (2) ఖడ్గము నెత్తిన యపుడు – తోడుగనున్నాడు యోసేపు ద్వేషించ బడినపుడు (2) గోతిలో త్రోయబడినపుడు (2) శోధనలో చెరసాలయందు (2) సింహాసనమెక్కిన యపుడు – తోడుగనున్నాడు ఎర్ర సముద్రపు తీరమునందు (2) ఫరో తరిమిన దినమందు (2) యోర్దాను దాటిన దినమందు (2) యెరికో కూలిన దినమందు – తోడుగనున్నాడు దావీదు సింహము నెదిరించి (2) ధైర్యాన చీల్చినయపుడు (2) గొల్యాతును హతమార్చినయపుడు (2) సౌలుచే తరుమబడినపుడు – తోడుగనున్నాడు సింహపు బోనులో దానియేలు (2) షద్రకు మేషా కబేద్నెగో (2) అగ్ని గుండములో వేయబడెన్ (2) నల్గురిగా కనబడినపుడు – తోడుగనున్నాడు పౌలు బంధించబడినపుడు (2) పేతురు చెరలో నున్నపుడు (2) అపోస్తలులు విశ్వాసులు (2) హింసించ బడినయపుడు – తోడుగనున్నాడు ||దేవుడు|| Devudu Manaku Ellappudu (2) Thoduga Nunnaadu (3) Aedenulo Aadaamutho Nunden (2) Haanoku Thodanegenu (2) Deergha Darshakulatho Nunden (2) Dhanyulu Devuni Galavaaru – Thoduganunnaadu Daivaaznanu Shirasaavahinchi (2) Divyamuga Naa Braahaamu (2) Kanna Komaruni Khandinchutaku (2) Khadgamu Neththina Yapudu – Thoduganunnaadu Yosepu Dweshincha Badinapudu (2) Gothilo Throyabadinapudu (2) Shodhanalo Cherasaalayandu (2) Simhaasanamekkina Yapudu – Thoduganunnaadu Erra Samudrapu Theeramunandu (2) Pharo Tharimina Dinamandu (2) Yordaanu Daatina Dinamandu (2) Yeriko Koolina Dinamandu – Thoduganunnaadu Daaveedu Simhamu Nedirinchi (2) Dhairyaana Cheelchinayapudu (2) Golyaathunu Hathamaarchinayapudu (2) Souluche Tharumabadinapudu – Thoduganunnaadu Simhapu Bonulo Daaniyelu (2) Shadraku Meshaa Kabednego (2) Agni Gundamulo Veyabaden (2) Nalgurigaa Kanabadinapudu – Thoduganunnaadu Poulu Bandhinchabadinapudu (2) Pethuru Cheralo Nunnapudu (2) Aposthalulu Vishwaasulu (2) Himsincha Badinayapudu – Thoduganunnaadu ||Devudu||