దేవుడు దేహమును - YouWorship
Devudu Dehamunu
Artist: సాయారం గట్టు
Category: Christmas
Song Lyrics
దేవుడు దేహమును పొందిన దినము మనిషిగా మారి ఇల చేరిన క్షణము (2) తార వెలిగెను – దూత పాడెను పరలోకనికి మార్గము వెలిసెను (2) స్తుతుల గానములు పాడి పరవశించెదము యేసు నామమునే చాటి మహిమ పరిచెదము (2) దూత పలికెను భయము వలదని తెలిపే వార్తను యేసే క్రీస్తని (2) చీకటి తొలగెను రారాజుకు భయపడి లోకము వెలిగెను మరణము చెరవిడి (2) క్రీస్తు పుట్టెనని తెలిపి సంతోషించెదము నిత్య జీవమునే చాటి ఘనత పొందెదము (2) ||దేవుడు|| సృష్టి కారుడు అల్పుడాయెను అది శాపము తీయ వచ్చెను (2) పాపము ఎరుగని మనిషిగా బ్రతికెను మానవ జాతికి మార్గమై నిలిచెను (2) నమ్మి ఒప్పినను చాలు తొలగు పాపములు పరము చేరుటకు మనకు కలుగు దీవెనలు (2) ||దేవుడు|| Devudu Dehamunu Pondina Dinamu Manishigaa Maari Ila Cherina Kshanamu (2) Thaara Veligenu – Dootha Paadenu Paralokaaniki Maargamu Velisenu (2) Sthuthulu Gaanamulu Paadi Paravashinchedamu Yesu Naamamune Chaati Mahima Parichedamu (2) ||Devudu|| Dootha Palikenu Bhayamu Valadani Thelipe Vaarthanu Yese Kreesthani (2) Cheekati Tholagenu Raaraajuku Bhayapadi Lokamu Veligenu Maranamu Cheravidi (2) Kreesthu Puttenani Thelipi Santhoshinchedamu Nithya Jeevamune Chaati Ghanatha Pondedamu (2) ||Devudu|| Srushtikaarudu Alpudaayenu Aadi Shaapamu Theeya Vachchenu (2) Paapamu Erugani Manishigaa Brathikenu Maanava Jaathiki Maargamai Nilichenu (2) Nammi Oppinanu Chaalu Tholagu Paapamulu Paramu Cherutaku Manaku Kalugu Deevenalu (2) ||Devudu||