దేవా వెంబడించితి నీ - YouWorship
Devaa Vembadinchithi Nee
Artist: ఎ.బి.మాసిలామణి
Category: Worship
Song Lyrics
దేవా! వెంబడించితి నీ నామమున్ - జీవితేశ్వర నా జీవితాశ నీవే = రావె నా భాగ్యమా యేసువా ॥దేవా॥ 1. యేసూ! నీదు ప్రేమను నే వింటిని - భాసురంబగు నీ సిలువ నే గంటిని = యేసువాడను నే నంటిని ॥దేవా॥ 2. ప్రభో! ప్రారంభించితి ప్రయాణమున్-పరలోక యెరూషలేము పురికిన్ = పావనా జూపుము మార్గము ॥దేవా॥ 3. నాధా! ఈదలేను ఈ ప్రవాహమున్ - నీదరిన్ గాన నీ కెరటాలధాటిచే = నావికా రమ్ము నన్ బ్రోవుము ॥దేవా॥ 4. స్వామి! నీదు ప్రేమకు నే సాక్షిని - సంఘమందున నా పొరుగువారికి నీ = సత్య సువార్త నే జాటుదున్ ॥దేవా॥ ర్. రాజా! నీదు రాజ్యములో జేరితి - రమ్యమౌ రాజ్యమందున నన్ వాడుము Devaa! Vembadinchithi Nee Naamamun - Jeevitheshvara Naa Jeevithaasha Neeve = Raave Naa Bhaagyamaa Yesuvaa ॥Devaa॥ 1. Yesoo! Needu Premanu Ne Vintini - Bhaasurambagu Nee Siluva Ne Gantini = Yesuvaadanu Ne Nantini ॥Devaa॥ 2. Prabho! Praarambhinchithi Prayaanamun-Paraloka Yerooshalemu Purikin = Paavanaa Joopumu Maargamu ॥Devaa॥ 3. Naadhaa! Eedalenu Ee Pravaahamun - Needarin Gaana Nee Kerataaladhaatiche = Naavikaa Rammu Nan Brovumu ॥Devaa॥ 4. Svaami! Needu Premaku Ne Saakshini - Sangghamanduna Naa Poruguvaariki Nee = Sathya Suvaartha Ne Jaatudun ॥Devaa॥ R. Raajaa! Needu Raajyamulo Jerithi - Ramyamau Raajyamanduna Nan Vaadumu