దేవా నీ సన్నిధిలో - YouWorship
Devaa Nee Sannidhilo
Artist: Unknown Artist
Category: Prayer
Song Lyrics
దేవా నీ సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము – (2) ||దేవా|| అపరాధులగు నీదు ప్రజల నెపములన్నియు బాపి (2) కృపాళుండగు యేసు ప్రభువా కృపను జూపి రక్షించుమయా (2) ||దేవా|| చేసి యున్నాము నేరములెన్నో చేసిన మేలులను మరచి (2) మోసములలో బడియున్నాము యేసుప్రభు జయమునిమ్ము (2) ||దేవా|| లోకపు మర్యాదలకు లొంగి లోకుల మాటలను వినియు (2) నీ కట్టడలను మరచితిమి కట్టుము మమ్ము నీ వాక్యముచే (2) ||దేవా|| నిస్వార్థులగు నీ దాసులను విశ్వాస ప్రమాణికులన్ (2) శాశ్వతమైన ప్రేమతో నింపు విశ్వాసులు స్థిరపడి నడువ (2) ||దేవా|| సహవాసములో మమ్ము నిలిపి సహనము మాకు నేర్పించి (2) మహిమా పూర్ణుడ యేసు నిన్ను ఈ మహిలో చాటించుటకు (2) ||దేవా|| Devaa Nee Sannidhilo Nilachi Deenulamai Morapettuchunnaamu – (2) ||Devaa|| Aparaadhulagu Needu Prajala Nepamulanniyu Baapi (2) Krupaalundagu Yesu Prabhuvaa Krupanu Joopi Rakshinchumayaa (2) ||Devaa|| Chesiyunnaamu Neramulenno Chesina Melulanu Marachi (2) Mosamulalo Badiyunnaamu Yesu Prabhu Jayamu Nimmu (2) ||Devaa|| Lokapu Maryaadalaku Longi Lokula Maatalanu Viniyu (2) Nee Kattadalanu Marachithimi Kattumu Mammu Nee Vaakyamuche (2) ||Devaa|| Nisswaardhulagu Nee Daasulanu Vishwaasa Pramaanikulan (2) Shaashwathamaina Prematho Nimpu Vishwaasulu Sthirapadi Naduva (2) ||Devaa|| Sahavaasamulo Mammu Nilipi Sahanamu Maaku Nerpinchi (2) Mahimaa Poornuda Yesu Ninnu Ee Mahilo Chaatinchutaku (2) ||Devaa||