దేవా నీ కృపచొప్పున నన్ను కరుణింపుము - YouWorship
Devaa Nee Krupachoppuna Nannu Karunimpumu
Artist: సీయోను గీతాలు
Category: Prayer
Song Lyrics
పల్లవి: యెహోవా నా దేవా (1) 1. దేవా నీ కృపచొప్పున - నన్ను కరుణింపుము (2) కృప చొప్పున నా అతిక్రమ - ములను తుడిచివేయుము (2) 2. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము 3. నీకు విరోధముగానే - పాపము చేసియున్నాను నీ దృష్టి యెడల చెడు - తనము నే చేసియున్నాను 4. ఆజ్ఞ యిచ్చునపుడు - నీతిమంతుడవుగను తీర్పు తీర్చునపుడు నిర్మలుడవుగ నుందువు 5. పాపములోనే పుట్టిన - వాడను పాపములోనే నాదు తల్లి నన్ను గర్భము ధరియించెను 6. వంతరంగమున - సత్యము కోరుచున్నావు ఆంతర్యములో నాకు జ్ఞనము తెలియజేయుదువు 7. హిస్సోపుతో శుద్ధీకరించు - పవిత్రుడనగుదును హిమము కంటె తెల్లగా నుండునట్లు కడుగుము 8. ఉత్సాహ సంతోషములు - నాకు వినిపింపుము అప్పుడు నీవు విరిచిన - యెముకలు హర్షించును 9. నాదు పాపములకు - విముఖుడవు కమ్ము (2) నాదు దోషములన్నింటిని – తుడిచి వేయుము (2) Pallavi: Yehovaa Naa Devaa (1) 1. Devaa Nee Krupachoppuna - Nannu Karunimpumu (2) Krupa Choppuna Naa Athikrama - Mulanu Thudichiveyumu (2) 2. Naa Doshamu Povunatlu Nannu Baagugaa Kadugumu Naa Paapamu Povunatlu Nannu Pavithraparachumu 3. Neeku Virodhamugaane - Paapamu Chesiyunnaanu Nee Drushti Yedala Chedu - Thanamu Ne Chesiyunnaanu 4. Aagna Yichchunapudu - Neethimanthudavuganu Theerpu Theerchunapudu Nirmaludavuga Nunduvu 5. Paapamulone Puttina - Vaadanu Paapamulone Naadu Thalli Nannu Garbhamu Dhariyinchenu 6. Vantharanggamuna - Sathyamu Koruchunnaavu Aantharyamulo Naaku Gnanamu Theliyajeyuduvu 7. Hissoputho Shuddheekarinchu - Pavithrudanagudunu Himamu Kante Thellagaa Nundunatlu Kadugumu 8. Uthsaaha Santhoshamulu - Naaku Vinipimpumu Appudu Neevu Virichina - Yemukalu Harshinchunu 9. Naadu Paapamulaku - Vimukhudavu Kammu (2) Naadu Doshamulannintini – Thudichi Veyumu (2)