దేవా నా ప్రభువా నిను గూర్చి ఉప్పొంగె నా హృదయం - YouWorship
Devaa Naa Prabhuvaa Ninu Goorchi Uppongge Naa Hrudayang
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: దేవా నా ప్రభువా నిను గూర్చి ఉప్పొంగె నా హృదయం (2) 1. నీ నామమును నే ఘనపరచి - హెచ్చించి పూజింతున్ (2) శ్లాఘించి కొనియాడుటలో - నాకిచ్చిన నీ కృపకై (2) 2. ఎండిన భూమిలో లేత మొక్కవలె - పలుశ్రమలను పొందితివి వ్యసనాక్రాంతుడవై వ్యాధినొంది - నా శిక్షను పొందితివి 3. దవళవర్ణుడ రత్నవర్ణుడవు - నా ప్రియుడవు నీవే ప్రభూ పదివేలలో నిను గుర్తించెదను - నా పరమ పితా నిన్ను 4. గొర్రెపిల్ల పెండ్లి విందునందు - రారాజు రూపమును నిరతంబును చూచె నిరీక్షణతో - నింగిని నే జూచెదను Pallavi: Devaa Naa Prabhuvaa Ninu Goorchi Uppongge Naa Hrudayan (2) 1. Nee Naamamunu Ne Ghanaparachi - Hechchinchi Poojinthun (2) Shlaaghinchi Koniyaadutalo - Naakichchina Nee Krupakai (2) 2. Endina Bhoomilo Letha Mokkavale - Palushramalanu Pondithivi Vyasanaakraanthudavai Vyaadhinondi - Naa Shikshanu Pondithivi 3. Davalavarnuda Rathnavarnudavu - Naa Priyudavu Neeve Prabhoo Padivelalo Ninu Gurthinchedanu - Naa Parama Pithaa Ninnu 4. Gorrepilla Pendli Vindunandu - Raaraaju Roopamunu Nirathambunu Chooche Nireekshanatho - Ninggini Ne Joochedanu