దేవా నా దేవుడవు నీవే వేకువనే నిన్ను వెదకుదును - YouWorship
Devaa Naa Devudavu Neeve Vekuvane Ninnu Vedakudunu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: దేవా నా దేవుడవు నీవే వేకువనే నిన్ను వెదకుదును (2) 1. నీ ప్రభావ బలమును చూడ - నీ పరిశుద్ధాలయమందు (2) నే నెంతో ఆశ తోడ - నీ వైపు కాచియున్నాను (2) 2. నీళ్లు లేక యెండిన చోట - నా ప్రాణము నీ కొరకు దాహము గొని యున్నది - నీ మీద ఆశచేత 3. నిను చూడ నా శరీరం - కృశించి పోవుచున్నది నీ కృప జీవముకంటె శ్రేష్ఠం - నా పెదవులు నిన్ను స్తుతించున్ 4. నా పడక మీద నిను దలచి - రాత్రి జాములో ధ్యానించునపుడు క్రొవ్వు మెదడు దొరకినట్లు - నా ప్రాణము తృప్తి నొందుచున్నది 5. ఉత్సాహముతో నా నోరు - నిన్నుగూర్చి పాడుచున్నది నా జీవిత కాలమంత - ఈలాగు నిన్ను స్తుతియించెదన్ 6. నా సహాయుడా నీ పేరు - బట్టి నా చేతు లెత్తెదను నీ చాటున శరణు జొచ్చి - ఉత్సాహధ్వని చేసెదను 7. నను చంప వెదకెడి వారు - పాతాళమునకు పోయెదరు ఖడ్గంబునకు గురియై - మరి నక్కలపాలగుదురు 8. దేవుని బట్టి రాజానందించున్ - తన తోడు ప్రమాణము చేయు ప్రతివాడు అతిశయించును - మూయబడు నబద్ధికుల నోరు Pallavi: Devaa Naa Devudavu Neeve Vekuvane Ninnu Vedakudunu (2) 1. Nee Prabhaava Balamunu Chooda - Nee Parishuddhalayamandu (2) Ne Nentho Aasha Thoda - Nee Vaipu Kaachiyunnaanu (2) 2. Neellu Leka Yendina Chota - Naa Praanamu Nee Koraku Daahamu Goni Yunnadi - Nee Meeda Aashachetha 3. Ninu Chooda Naa Shareeran - Krushinchi Povuchunnadi Nee Krupa Jeevamukante Shreshthan - Naa Pedavulu Ninnu Sthuthinchun 4. Naa Padaka Meeda Ninu Dalachi - Raathri Jaamulo Dhyaaninchunapudu Krovvu Medadu Dorakinatlu - Naa Praanamu Thrupthi Nonduchunnadi 5. Uthsaahamutho Naa Noru - Ninnugoorchi Paaduchunnadi Naa Jeevitha Kaalamantha - Eelaagu Ninnu Sthuthiyinchedan 6. Naa Sahaayudaa Nee Peru - Batti Naa Chethu Leththedanu Nee Chaatuna Sharanu Jochchi - Uthsaahadhvani Chesedanu 7. Nanu Champa Vedakedi Vaaru - Paathaalamunaku Poyedaru Khadgambunaku Guriyai - Mari Nakkalapaalaguduru 8. Devuni Batti Raajaanandinchun - Thana Thodu Pramaanamu Cheyu Prathivaadu Athishayinchunu - Mooyabadu Nabaddhikula Noru