దేవా నాయందు నీకు - YouWorship
Devaa Naayandu Neeku
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
పల్లవి: దేవా నాయందు నీకు - ఎంతో ప్రేమ - నీ దివ్య ప్రేమ నాలో - ఉప్పొంగెను (1) హల్లెలూయా హల్లెలూయా - హల్లెలూయా హల్లెలూయా 1. దిన దినము నీదు ప్రేమ - రుచి చూచుచున్నాను (2) దయగల జీవాహారముతో - పోషించుచున్నావు (2) దేవా! నీ జీవ జలము - నాకిచ్చితివే నీ దివ్య ప్రేమ నాలో - ఉప్పొంగెను (2) 2. నా పాదములను నీవు - బండపై నిలిపితివి నా యడుగుల నెల్ల నీవు - స్థిరపరచిన దేవుడవు దేవా! నా కాశ్రయుడవు - నీవే కదా నీ దివ్య ప్రేమ నాలో - ఉప్పొంగెను 3. సిలువలో నీ రక్తము కార్చి - నన్ను రక్షించితివి సార్వత్రిక సంఘములోన - నన్నైక్య పరచితివి దేవా! నీ దయ నా యెడల - అత్యున్నతము - నీ దివ్య ప్రేమ నాలో - ఉప్పొంగెను 4. వాగ్దానములను నాలో - నెరవేర్చిన ఓ ప్రభువా విడువక నా యెడల నీదు - కృప జూపుచున్నావు దేవా! నీ మారని ప్రేమ - సంపూర్ణము - నీ దివ్య ప్రేమ నాలో - ఉప్పొంగెను 5. మృతిని గెల్చి మాకొరకై - తిరిగి లేచిన ప్రభువా మా కొరకై త్వరలో రానై - యున్న మహిమ రాజా దేవా! నీ సన్నిధి నాకు - ఎంతో ప్రియము - నీ దివ్య ప్రేమ నాలో - ఉప్పొంగెను Pallavi: Devaa Naayandu Neeku - Entho Prema - Nee Divya Prema Naalo - Upponggenu (1) Hallelooyaa Hallelooyaa - Hallelooyaa Hallelooyaa 1. Dina Dinamu Needu Prema - Ruchi Choochuchunnaanu (2) Dayagala Jeevaahaaramutho - Poshinchuchunnaavu (2) Devaa! Nee Jeeva Jalamu - Naakichchithive Nee Divya Prema Naalo - Upponggenu (2) 2. Naa Paadamulanu Neevu - Bandapai Nilipithivi Naa Yadugula Nella Neevu - Sthiraparachina Devudavu Devaa! Naa Kaashrayudavu - Neeve Kadaa Nee Divya Prema Naalo - Upponggenu 3. Siluvalo Nee Rakthamu Kaarchi - Nannu Rakshinchithivi Saarvathrika Sangghamulona - Nannaikya Parachithivi Devaa! Nee Daya Naa Yedala - Athyunnathamu - Nee Divya Prema Naalo - Upponggenu 4. Vaagdaanamulanu Naalo - Neraverchina O Prabhuvaa Viduvaka Naa Yedala Needu - Krupa Joopuchunnaavu Devaa! Nee Maarani Prema - Sampoornamu - Nee Divya Prema Naalo - Upponggenu 5. Mruthini Gelchi Maakorakai - Thirigi Lechina Prabhuvaa Maa Korakai Thvaralo Raanai - Yunna Mahima Raajaa Devaa! Nee Sannidhi Naaku - Entho Priyamu - Nee Divya Prema Naalo - Upponggenu