దేవా తరతరములకు మాని వాస స్థలము నీవే - YouWorship
Devaa Tharatharamulaku Maani Vaasa Sthalamu Neeve
Artist: సీయోను గీతాలు
Category: Prayer
Song Lyrics
పల్లవి: దేవా తరతరములకు మాని - వాస స్థలము నీవే (2) 1. మా దోషములను నీవు నీ యెదుట - నుంచుకొని యున్నావు (2) నీ ముఖకాంతిలో మా - రహస్య పా - పములు కనబడుచున్నవి (2) 2. మా దినములన్ని గడిపితిమి - నీ యుగ్రత భరించుచు నిట్టూర్పులు విడచినట్లు మా జీ-వితము జరుపుకొందుము 3. డెబ్బది సంవత్సరములేగా - మాదు ఆయుష్కాలము అధిక బలమున్న యెడల యెనుబది - సంవత్సరములగును 4. అయినను వాటి వైభవమంత - ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించును మే-మెగిరి పోయెదము 5. నీకే జెందవలసినట్టి భయము - కొలది పుట్టినట్టి నీదు ఆగ్రహ క్రోధ బలము - ఎవ్వరికి తెలియున్ 6. మాకు నీ జ్ఞాన హృదయమును - కలుగునట్లు చేయుము మా దినములు లెక్కించుటకు - మాకు నివే నేర్పుము Pallavi: Devaa Tharatharamulaku Maani - Vaasa Sthalamu Neeve (2) 1. Maa Doshamulanu Neevu Nee Yeduta - Nunchukoni Yunnaavu (2) Nee Mukhakaanthilo Maa - Rahasya Paa - Pamulu Kanabaduchunnavi (2) 2. Maa Dinamulanni Gadipithimi - Nee Yugratha Bharinchuchu Nittoorpulu Vidachinatlu Maa Jee-Vithamu Jarupukondumu 3. Debbadi Sanvathsaramulegaa - Maadu Aayushkaalamu Adhika Balamunna Yedala Yenubadi - Sanvathsaramulagunu 4. Ayinanu Vaati Vaibhavamantha - Aayaasame Duhkhame Adi Thvaragaa Gathinchunu Me-Megiri Poyedamu 5. Neeke Jendavalasinatti Bhayamu - Koladi Puttinatti Needu Aagraha Krodha Balamu - Evvariki Theliyun 6. Maaku Nee Gnaana Hrudayamunu - Kalugunatlu Cheyumu Maa Dinamulu Lekkinchutaku - Maaku Nive Nerpumu