దేవా ఇలలోన నీవు - YouWorship
Devaa Ilalona Neevu
Artist: సాయారం గట్టు
Category: Thanksgiving
Song Lyrics
దేవా ఇలలోన నీవు మాకిచ్చిన గృహము మా తోడుగా కొలువుండేటి నీదు ఆలయము (2) మా యజమానివి నీవై మమ్ములను నడిపించు నీ పనికి పాటుపడేలా పాత్రలుగా దీవించు (2) వందనములు అందుకో మా యేసయ్యా కలకాలం నీ కాపుదలే కావాలయ్యా (2) ||దేవా|| నువ్వు పుట్టిన రోజు నీకు స్థలమైనా లేదయ్యా పరిచర్య చేయు సమయము ఏ గృహము నీకుందయ్యా (2) ఆ ఒలీవల కొండలలోనే తల దాచిన యేసయ్యా నీ వారలుగా ప్రేమించి నీ గృహమున నిలిపావా ||వందనములు|| నీ ప్రేమను ప్రతిఫలించగా నీ వెలుగును పంచుమయా నీ నీడలో మే సాగుటకు మా గృహమును కట్టుమయా (2) శోధన వేదనలెదిరించే బలమును అందించుమయ్యా నీ కృపలను చాటించేటి సాక్ష్యములతో నింపుమయ్యా ||వందనములు|| నీ ఆజ్ఞలు పాటించేటి హృదయముతో మేముండాలి నిరతము తరగని నీ కృపతో తరతరములు నిండాలి (2) సమాధాన కర్తవు నీవై మా తోడుగా నీవుండాలి కలిమిలేమిలందు సైతం నీ మార్గములో సాగాలి ||వందనములు|| Devaa Ilalona Neevu Maakichchina Gruhamu Maa Thodugaa Koluvundeti Needu Aalayamu (2) Maa Yajamaanivi Neevai Mammulanu Nadipinchu Nee Paniki Paatupadelaa Paathralugaa Deevinchu (2) Vandanamulu Anduko Maa Yesayyaa Kalakaalam Nee Kaapudale Kaavaalayyaa (2) ||Devaa|| Nuvvu Puttina Roju Neeku Sthalamainaa Ledayyaa Paricharya Cheyu Samayamu Ae Gruhamu Neekundayyaa (2) Aa Oleevala Kondalalone Thaladaachina Yesayyaa Nee Vaaralugaa Preminchi Nee Gruhamuna Nilipaavaa ||Vandanamulu|| Nee Premanu Prathiphalinchagaa Nee Velugunu Panchumayaa Nee Needalo Me Saaugtaku Maa Gruhamunu Kattumayaa (2) Shodhana Vedanaledirinche Balamunu Andinchumayyaa Nee Krupalanu Chaatincheti Saakshyamulatho Nimpumayyaa ||Vandanamulu|| Nee Aagnalu Paatincheti Hrudayamutho Memundaali Nirathamu Tharagni Nee Krupatho Tharatharamulu Nindaali (2) Samaadhaana Karthavu Neevai Maa Thodugaa Neevundaali Kalimi Lemilandu Saitham Nee Maargamulo Saagaali ||Vandanamulu||