దేవా! నీ తలంపులు నా కెంతో ప్రియము ఎంతో ప్రియము - YouWorship
Devaa! Nee Thalampulu Naa Kentho Priyamu Entho Priyamu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: దేవా! నీ తలంపులు నా - కెంతో ప్రియము ఎంతో ప్రియము (2) వాటిమొత్తము దాసుడనగునే - నెంచి చెప్పెద గొప్పది గొప్పది (2) 1. పాతాళపు పాశములు - నన్ను అరికట్టగా (2) ఆవరించె మరణ ఉరులు (2) - క్రుంగిపోతినో దేవా (3) ప్రార్థనలో మొఱ్ఱపెట్ట - వింటివి నా దీనధ్వని (2) అందుకే నే పాడెద - కీర్తించెద (1) 2. నా మీదికి లేచువారు - నన్ను బెదరించెడు వారు దేవా నీ రక్షణ నా నుండి - దాటిపోయెననె వారు ప్రార్థనలో మొఱ్ఱపెట్ట - వింటివి నా దీనధ్వని అందుకే నే పాడెద - కీర్తించెద 3. నీవే నా కాపరి నంటివి - కాపుదలలో రాలేక యుంటిని పాపినై యుండి పాపమెరుగనంటి - శాపగ్రస్తుడనైతి దేవా ప్రార్థనలో మొఱ్ఱపెట్ట - వింటివి నా దీనధ్వని అందుకే - నే పాడెద - కీర్తించెద 4. మూతవేసిన నా మూర్ఖతయును - దాగియుండిన నా పాపమును విప్పిచూపి శిక్షింపనంటివి - కక్షలేని నా దేవా అర్హతలేనివాడను - సర్వము పోయినవాడను అందుకే నే పాడెద - కీర్తించెద 5. నేను నీ కట్టడలను - నేర్చుకొనునట్లును శ్రమపొంది యుండుట నాకు - మేలని నేర్పించితివి నీ ధర్మ శాస్త్రము నాకు ప్రియము - దినమెల్ల నేను ధ్యానింతును అందుకే నే పాడెద - కీర్తించెద 6. పర్వతములు తొలగిపోయినను - తత్తరిల్లిన మెట్టలు మట్టమై ఒట్టు పెట్టుకొని నేను చెప్పెద - విడచిపోదు నిన్ నాదు కృప నీ వాగ్దానములకే నా స్తోత్రము - నా ఆర్త ధ్వనులు నా హృదయ ధ్యానం అంగీకరించు దేవా - కీర్తించెద 7. నేను చేయునది ఇపుడు - నీవు ఎరుగజాలవనె తెలిసికొందువు నీవు ఇక ముందుకు - నా పరిపూర్ణ మార్గమిదే వింటిని నే నీ స్వరము - కంటిని నే నీ రూపము హల్లెలూయ పాడెద - కీర్తించెద Pallavi: Devaa! Nee Thalampulu Naa - Kentho Priyamu Entho Priyamu (2) Vaatimoththamu Daasudanagune - Nenchi Cheppeda Goppadi Goppadi (2) 1. Paathaalapu Paashamulu - Nannu Arikattagaa (2) Aavarinche Marana Urulu (2) - Krunggipothino Devaa (3) Praarthanalo Morrapetta - Vintivi Naa Deenadhvani (2) Anduke Ne Paadeda - Keerthincheda (1) 2. Naa Meediki Lechuvaaru - Nannu Bedarinchedu Vaaru Devaa Nee Rakshana Naa Nundi - Daatipoyenane Vaaru Praarthanalo Morrapetta - Vintivi Naa Deenadhvani Anduke Ne Paadeda - Keerthincheda 3. Neeve Naa Kaapari Nantivi - Kaapudalalo Raaleka Yuntini Paapinai Yundi Paapamerugananti - Shaapagrasthudanaithi Devaa Praarthanalo Morrapetta - Vintivi Naa Deenadhvani Anduke - Ne Paadeda - Keerthincheda 4. Moothavesina Naa Moorkhathayunu - Daagiyundina Naa Paapamunu Vippichoopi Shikshimpanantivi - Kakshaleni Naa Devaa Arhathalenivaadanu - Sarvamu Poyinavaadanu Anduke Ne Paadeda - Keerthincheda 5. Nenu Nee Kattadalanu - Nerchukonunatlunu Shramapondi Yunduta Naaku - Melani Nerpinchithivi Nee Dharma Shaasthramu Naaku Priyamu - Dinamella Nenu Dhyaaninthunu Anduke Ne Paadeda - Keerthincheda 6. Parvathamulu Tholagipoyinanu - Thaththarillina Mettalu Mattamai Ottu Pettukoni Nenu Cheppeda - Vidachipodu Nin Naadu Krupa Nee Vaagdaanamulake Naa Sthothramu - Naa Aartha Dhvanulu Naa Hrudaya Dhyaanan Anggeekarinchu Devaa - Keerthincheda 7. Nenu Cheyunadi Ipudu - Neevu Erugajaalavane Thelisikonduvu Neevu Ika Munduku - Naa Paripoorna Maargamide Vintini Ne Nee Svaramu - Kantini Ne Nee Roopamu Hallelooya Paadeda - Keerthincheda