దేవర నీ దీవెనలు - YouWorship
Devara Nee Deevenalu
Artist: అల్లారి పెద్ద వీరాస్వామి
Category: Marriage
Song Lyrics
దేవర నీ దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగ వేగమే దిగనిమ్ము పావన యేసుని ద్వారగను (2) దంపతులు దండిగ నీ ధాత్రిలో వెలయుచు సంపదలన్ సొంపుగ నింపుగ పెంపగుచు సహింపున వీరు సుఖించుటకై ||దేవర నీ|| ఈ కవను నీ కరుణన్ ఆకరు వరకును లోకములో శోకము లేకయే ఏకముగా బ్రాకటముగను జేకొనుము ||దేవర నీ|| ఇప్పగిది నెప్పుడును గొప్పగు ప్రేమతో నొప్పుచు దా మొప్పిన చొప్పున దప్పకను మెప్పుగ బ్రతుకగ బంపు కృపన్ ||దేవర నీ|| తాపములు పాపములు మోపుగ వీరిపై రాకుండగా గాపుగ బ్రాపుగ దాపునుండి యాపదలన్నియు బాపుచును ||దేవర నీ|| సాధులుగన్ జేయుటకై శోధనలచే నీవు శోధింపగా కదలక వదలక ముదమున నీ పాదము దాపున బాదుకొనన్ ||దేవర నీ|| మెండుగ భూమండలపు గండములలో వీరుండగను తండ్రిగ దండిగ నండనుండి వెండియు వానిని ఖండించావే ||దేవర నీ|| యిద్దరు వీరిద్దరును శుద్ధులై నిన్ను సేవించుటకై శ్రద్ధతో బుద్ధిగ సిధ్ధపడన్ దిద్దుము నీ ప్రియ బిడ్డలుగాన్ ||దేవర నీ|| వాసిగ నీ దాసులము చేసిన ఈ మొఱ్ఱల్ దీసికొని మా సకలేశ్వర నీ సుతుడ యేసుని పేరిట బ్రోవుమామేన్ ||దేవర నీ|| Devara Nee Deevenalu Dhaaraalamuganu Veeralapai Baaguga Vegame Diganimmu Paavana Yesuni Dvaaraganu (2) Dampathulu Dandiga Nee Dhaathrilo Velayuchu Sampadalan Sompuga Nimpuga Pempaguchu Sahimpuna Veeru Sukhinchutakai ||Devara Nee|| Ee Kavanu Nee Karunan Aakaru Varakunu Lokamulo Shokamu Lekaye Ekamugaa Braakatamuganu Jekonumu ||Devara Nee|| Ippagidi Neppudunu Goppagu Prematho Noppuchu Daa Moppina Choppuna Dappakanu Meppuga Brathukaga Bampu Krupan ||Devara Nee|| Thaapamulu Paapamulu Mopuga Veeripai Raakundagaa Gaapuga Braapuga Daapunundi Yaapadalanniyu Baapuchunu ||Devara Nee|| Saadhulugan Jeyutakai Shodhanalache Neevu Shodhinpagaa Kadalaka Vadalaka Mudamuna Nee Paadamu Daapuna Baadukonan ||Devara Nee|| Menduga Bhoomandalapu Gandamulalo Veerundaganu Thandriga Dandiga Nandanundi Vendiyu Vaanini Khandinchave ||Devara Nee|| Iddara Veeriddarunu Shudhdhulai Ninnu Sevinchutakai Shradhdhatho Budhdhiga Sidhdhapadan Didhdhumu Nee Priya Biddalugaan ||Devara Nee|| Vaasiga Nee Daasulamu Chesina Ee Moral Deesikoni Maa Sakaleshwara Nee Suthuda Yesuni Perita Brovumaamen ||Devara Nee||