దేవదేవుని కొనియాడెదము - YouWorship
Devadevuni Koniyaadedamu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: దేవదేవుని కొనియాడెదము - అవిరత త్రియేకుని స్తోత్రింతుము (1) అను పల్లవి: ఏపుగా దయాళుని పొగడెదము - పాప పరిహారుని పాడెదము (1) || దేవ || 1. దూతలు స్తుతించు మహోన్నతుడు - కన్య మరియ యందు జన్మించెను (1) మహియందు చీకటి పోగొట్టి - ఇహపర సుఖముల దయచేసెను (1) 2. పాపశాపమును తీర్చను - పాట్లు పడెను దేవ గొఱ్ఱె పిల్ల హా! మంచి గొఱ్ఱెల బోయడే - ప్రాణము నిచ్చెను మనకై 3. పాపముల కడిగి రక్షించెను - కృపనిచ్చె వేచియుండుటకై వైరిని జయింపను శక్తినిచ్చెను - నరులకు భాగ్యము నందించెను 4. ఆకాశము నుండి దిగి వచ్చును - లోకమున్ న్యాయము తీర్చుట ఆయత్తముగ కాచియుండెదము - పాయక వివేక కన్యల వలె 5. తన స్వరూపము నే దాల్చను - ఆయనే నా రూపము దాల్చెన్ దాసుడనగు నన్ను రక్షింపన్ - యేసు నరరూపము దాల్చెన్ 6. పాతాళ లోకము కూల్చవచ్చెన్ - జాతి యడ్డుగోడ పడగొట్టెను నిత్య జీవంబు నియ్యను వచ్చెను - నీతి సూర్యుడు ప్రభు యేసువే 7. హల్లెలూయ పాడి ఆర్భటింతుము - హర్షముతో యేసున్ చాటెదము బలుడైన తండ్రిని కీర్తింతుము - విలువ శుద్ధాత్మను శ్లాఘింతుము Pallavi: Devadevuni Koniyaadedamu - Aviratha Thriyekuni Sthothrinthumu (1) Anu Pallavi: Epugaa Dayaaluni Pogadedamu - Paapa Parihaaruni Paadedamu (1) || Deva || 1. Doothalu Sthuthinchu Mahonnathudu - Kanya Mariya Yandu Janminchenu (1) Mahiyandu Cheekati Pogotti - Ihapara Sukhamula Dayachesenu (1) 2. Paapashaapamunu Theerchanu - Paatlu Padenu Deva Gorre Pilla Haa! Manchi Gorrela Boyade - Praanamu Nichchenu Manakai 3. Paapamula Kadigi Rakshinchenu - Krupanichche Vechiyundutakai Vairini Jayimpanu Shakthinichchenu - Narulaku Bhaagyamu Nandinchenu 4. Aakaashamu Nundi Digi Vachchunu - Lokamun Nyaayamu Theerchuta Aayaththamuga Kaachiyundedamu - Paayaka Viveka Kanyala Vale 5. Thana Svaroopamu Ne Daalchanu - Aayane Naa Roopamu Daalchen Daasudanagu Nannu Rakshimpan - Yesu Nararoopamu Daalchen 6. Paathaala Lokamu Koolchavachchen - Jaathi Yaddugoda Padagottenu Nithya Jeevambu Niyyanu Vachchenu - Neethi Sooryudu Prabhu Yesuve 7. Hallelooya Paadi Aarbhatinthumu - Harshamutho Yesun Chaatedamu Baludaina Thandrini Keerthinthumu - Viluva Shuddhaathmanu Shlaaghinthumu