దివినేలు స్తోత్రార్హుడా - YouWorship
Divinelu Sthothraarhudaa
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
దివినేలు స్తోత్రార్హుడా యేసయ్యా దిగి రానైయున్న మహరాజువు నీవయ్యా మొదటివాడవు – కడపటివాడవు యుగయుగములలో ఉన్నవాడవు (2) మానక నా యెడల కృప చూపుచున్నావు మారదు నీ ప్రేమ తరతరములకు (2) మాట తప్పని మహనీయుడవు – మార్పులేని వాడవు నీవు చెప్పిన మంచి మాటలు – నెరవేర్చువాడవు నీ మాటలు జీవపు ఊటలు నీ కృపలే బలమైన కోటలు (2) ||దివినేలు|| దాచక నీ సంకల్పము తెలియజేయుచున్నావు దయనొందిన నీ జనుల ముందు నడుచుచున్నావు (2) దాటి వెళ్లని కరుణామూర్తివై – మనవి ఆలకించావు దీర్ఘ శాంతముగలవాడవై – దీవించువాడవు నీ దీవెన పరిమళ సువాసన నీ ఘనతే స్థిరమైన సంపద (2) ||దివినేలు|| సీయోను శిఖరముపై నను నిలుపుటకే జ్యేష్ఠుల సంఘముగా నను మార్చుటకే (2) దివ్యమైన ప్రత్యక్షతతో – నన్ను నింపియున్నావు సుందరమైన నీ పోలికగా – రూపు దిద్దుచున్నావు నీ రాజ్యము పరిశుద్ధ నగరము ఆ రాజ్యమే నిత్య సంతోషము (2) ||దివినేలు|| Divinelu Sthothraarhudaa Yesayyaa Digi Raanaiyunna Maharaajuvu Neevayyaa Modativaadavu – Kadapativaadavu Yugayugamulalo Unnavaadavu (2) Maanaka Naa Yedala Krupa Choopuchunnaavu Maaradu Nee Prema Tharatharamulaku (2) Maata Thappani Mahaneeyudavu – Maarpuleni Vaadavu Neevu Cheppina Manchi Maatalu – Neraverchuvaadavu Nee Maatalu Jeevapu Ootalu Nee Krupale Balamaina Kotalu (2) ||Divinelu|| Daachaka Nee Sankalpamu Theliyajeyuchunnaavu Dayanondina Nee Janula Mundu Naduchuchunnaavu (2) Daati Vellani Karunaamoorthivai – Manavi Aalakinchaavu Deergha Shaanthamugalavaadavai – Deevinchuvaadavu Nee Deevna Parimala Suvaasana Nee Ghanathe Sthiramaina Sampada (2) ||Divinelu|| Seeyonu Shikharamupai Nanu Niluputake Jyeshtula Sanghamugaa Nanu Maarchutake (2) Divyamaina Prathyakshathatho – Nannu Nimpiyunnaavu Sundaramaina Nee Polikagaa – Roopu Didduchunnaavu Nee Raajyamu Parishuddha Nagaramu Aa Raajyame Nithya Santhoshamu (2) ||Divinelu||