దినము గతియించెను - YouWorship
Dinamu Gathiyinchenu
Artist: దానరి మోజెస్
Category: Worship
Song Lyrics
దినము గతియించెను - దిననాథుండు పరాద్రి - వెనుకడాంగా గె నింకమా - మునిమాపు సంస్తవముం గొనుము సంప్రీతిమై - ఘనుండ దేవా ||దినము|| 1. సరవినంబరవీధి - సంజ కెంజాయలు - మురువుంజూపె - ప్రభువా దొరము నీ ముఖకాంతి - కిరణ జాలము మాపై - నెలపరమ్ము ||దినము|| 2. కటికి చీకటులు ది - క్కటములం గలిపియు - తృటములైన - నీ చెం గట నున్న నెట్టి సం - కటమేని మమ్ముం - దాకుటకు జంకు ||దినము|| 3. తలంపువలనను నోటి - పలుకువలనను జెనంటి - పనులవల్ల - మేము వలచి చేసిన పాప - ముల నెల్ల క్షమియింపు - మ లఘుక్షాంతి ||దినము|| 4. ముమ్మరమ్మగు శోధ - నమ్ములపై విజ - యమ్మునొంద - నీది నమ్ము మాకు సామ - ర్థ్య మొసంగితివి వంద - నమ్ము దేవ ||దినము|| 5. ఈ దినము మాకు స - మ్మోదంబుతో నిచ్చి - యాదుకొన్న - వరమౌ నీ దివ్యదానముల - కై దేవా మా కృతజ్ఞతను గొమ్ము ||దినము|| 6. అలసిన మా దేహ - ములకు వలసిన నిదురం - గలుగంజేసి - నీదూ తల హస్తములలో మ - మ్ములను దాంచుము భద్ర - ముగను దేవ ||దినము|| 7. అరుణోదయమునని - న్నర్చించు కొరకు నీ - కరము సాంచి - మమ్ము త్వరగా మేల్కొల్చుము - స్వాస్థ్య ప్రదాతవై - పరమదేవ ||దినము|| 8. దాత వీవె లోక - త్రాత వీవె మాకు - నేత వీవె - యేసు నీతి సూర్యుండవి - ఖ్యాతి మహిమలు నీకె - కలుగుంగాక ||దినము|| Dinamu Gathiyinchenu - Dinanaathundu Paraadri - Venukadaanggaa Ge Ningkamaa - Munimaapu Sansthavamun Gonumu Sampreethimai - Ghanunda Devaa ||Dinamu|| 1. Saravinambaraveedhi - Sanja Kenjaayalu - Muruvunjoope - Prabhuvaa Doramu Nee Mukhakaanthi - Kirana Jaalamu Maapai - Nelaparammu ||Dinamu|| 2. Katiki Cheekatulu Di - Kkatamulan Galipiyu - Thrutamulaina - Nee Chen Gata Nunna Netti San - Katameni Mammun - Daakutaku Jangku ||Dinamu|| 3. Thalampuvalananu Noti - Palukuvalananu Jenanti - Panulavalla - Memu Valachi Chesina Paapa - Mula Nella Kshamiyimpu - Ma Laghukshaanthi ||Dinamu|| 4. Mummarammagu Shodha - Nammulapai Vija - Yammunonda - Needi Nammu Maaku Saama - Rthya Mosanggithivi Vanda - Nammu Deva ||Dinamu|| 5. Ee Dinamu Maaku Sa - Mmodambutho Nichchi - Yaadukonna - Varamau Nee Divyadaanamula - Kai Devaa Maa Kruthagnathanu Gommu ||Dinamu|| 6. Alasina Maa Deha - Mulaku Valasina Niduran - Galuganjesi - Needoo Thala Hasthamulalo Ma - Mmulanu Daanchumu Bhadra - Muganu Deva ||Dinamu|| 7. Arunodayamunani - Nnarchinchu Koraku Nee - Karamu Saanchi - Mammu Thvaragaa Melkolchumu - Svaasthya Pradaathavai - Paramadeva ||Dinamu|| 8. Daatha Veeve Loka - Thraatha Veeve Maaku - Netha Veeve - Yesu Neethi Sooryundavi - Khyaathi Mahimalu Neeke - Kalugunggaaka ||Dinamu||