దాహముగల వారెల్లరు నీళ్ళయొద్దకు రారండి - YouWorship
Daahamugala Vaarellaru Neellayoddaku Raarandi
Artist: సీయోను గీతాలు
Category: Worship
Song Lyrics
పల్లవి: దాహముగల వారెల్లరు - నీళ్ళయొద్దకు రారండి (2) 1. దేవుని నది నీళ్ళతో నిండి - భువికి సారము నిచ్చుచున్నది - రారండి (2) దేవుని దీవెనల వలన నీవు తృప్తి పొందెదవు (2) 2. ఆనంద ప్రవాహ నదిలో - పానముతో దప్పి తీర్చును రారండి భూనివాసులు దాహముతో - ప్రాణము విడుచుచున్నారు 3. మంచితనముతో వత్సరమునకు మకుటము ధరింప చేసెను - రారండి మహిమతో నిండిన తన మార్గములో - మేలులు ప్రవహింప జేసెను 4. ప్రయాసభారము మోయువారు - యేసు నొద్దకు ఆశతోడను - రారండి తీసివేయును మీ భారము - నొసగు మీకు విశ్రాంతి 5. సకలము సిద్ధముగా నున్నది - శక్తిగల దేవుని విందునకు - రారండి సహవాసంబున భుజించును - చేర్చుకొనిన క్రీస్తు ప్రభుని 6. సత్యమును తెలిపెను ప్రభువు - ప్రత్యేక జీవము జీవింపను - రారండి ప్రత్యక్ష పరచెను తన వెలుగు - నిత్యము యేసుతో జీవించుడి 7. దేవుని నది జీవజల నది - ప్రవహించుచున్నది పల్లమునకు - రారండి దేవుని కృప పూర్ణతను బొందగ - నీవును విధేయుడవై యుండుము Pallavi: Daahamugala Vaarellaru - Neellayoddaku Raarandi (2) 1. Devuni Nadi Neellatho Nindi - Bhuviki Saaramu Nichchuchunnadi - Raarandi (2) Devuni Deevenala Valana Neevu Thrupthi Pondedavu (2) 2. Aananda Pravaaha Nadilo - Paanamutho Dappi Theerchunu Raarandi Bhoonivaasulu Daahamutho - Praanamu Viduchuchunnaaru 3. Manchithanamutho Vathsaramunaku Makutamu Dharimpa Chesenu - Raarandi Mahimatho Nindina Thana Maargamulo - Melulu Pravahimpa Jesenu 4. Prayaasabhaaramu Moyuvaaru - Yesu Noddaku Aashathodanu - Raarandi Theesiveyunu Mee Bhaaramu - Nosagu Meeku Vishraanthi 5. Sakalamu Siddhamugaa Nunnadi - Shakthigala Devuni Vindunaku - Raarandi Sahavaasambuna Bhujinchunu - Cherchukonina Kreesthu Prabhuni 6. Sathyamunu Thelipenu Prabhuvu - Prathyeka Jeevamu Jeevimpanu - Raarandi Prathyaksha Parachenu Thana Velugu - Nithyamu Yesutho Jeevinchudi 7. Devuni Nadi Jeevajala Nadi - Pravahinchuchunnadi Pallamunaku - Raarandi Devuni Krupa Poornathanu Bondaga - Neevunu Vidheyudavai Yundumu