దారితొలగితివేల రక్షణ మార్గము వెదకు - YouWorship
Daaritholagithivela Rakshana Maargamu Vedaku
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: దారితొలగితివేల (2) - రక్షణ మార్గము వెదకు (2) 1. పాపమందే జన్మించితివి (2) పాపమందే జీవించితివి (2) ఎరుగకున్నావు (2) 2. పాప ఫలితము ఘోరమరణము నరకదండన అగ్ని గుండము - మారు మనస్సు నొందు 3. నేడే యేసుని వాక్యము వినుము (2) నేడే ప్రభుని స్వరము వినుము - తన చిత్తము నెరుగు 4. నీవు నశించుట కోరడు ప్రభువు (2) తరుణముండగ వేడుకొనుము - ఎరుగు నీ స్థితిని 5. అందరిని మారుమనస్సును పొందుమని ప్రభువాజ్ఞాపించె - పశ్చాత్తాపపడుము 6. ఒప్పుకొనుము నీ పాపమును క్షమాపణకై వేడుకొనుము - రక్షణ పొందెదవు 7. విశ్వాసముతో అడిగిన యెడల పొందితివని నిశ్చయముగ నెరుగు - గొప్ప రక్షణ యిదియే Pallavi: Daaritholagithivela (2) - Rakshana Maargamu Vedaku (2) 1. Paapamande Janminchithivi (2) Paapamande Jeevinchithivi (2) Erugakunnaavu (2) 2. Paapa Phalithamu Ghoramaranamu Narakadandana Agni Gundamu - Maaru Manassu Nondu 3. Nede Yesuni Vaakyamu Vinumu (2) Nede Prabhuni Svaramu Vinumu - Thana Chiththamu Nerugu 4. Neevu Nashinchuta Koradu Prabhuvu (2) Tharunamundaga Vedukonumu - Erugu Nee Sthithini 5. Andarini Maarumanassunu Pondumani Prabhuvaagnaapinche - Pashchaaththaapapadumu 6. Oppukonumu Nee Paapamunu Kshamaapanakai Vedukonumu - Rakshana Pondedavu 7. Vishvaasamutho Adigina Yedala Pondithivani Nishchayamuga Nerugu - Goppa Rakshana Yidiye