త్రాహిమాం క్రీస్తు నాథ - YouWorship
Thraahimaam Kreesthu Naatha
Artist: పురుషోత్తము చౌదరి
Category: Prayer
Song Lyrics
త్రాహిమాం క్రీస్తు నాథ – దయ జూడ రావే నేను – దేహి యనుచు నీ పాదములే దిక్కుగా జేరితి నిపుడు ||త్రాహిమాం|| గవ్వ చేయరాని చెడ్డ – కర్మేంద్రియాధీనుడనై రవ్వ పాలై నేనెంతో – నెవ్వ బొందితి త్రవ్వుచున్న కొలది – పెరుగు – దరగదు నా పాప రాశి యివ్విధమున జెడిపోతిని నే – నేమి సేతు నోహోహోహో ||త్రాహిమాం|| నీ యందు భయభక్తులు లేని – నిర్లజ్జా చిత్తము బూని చేయరాని దుష్కర్మములు – చేసినాడను దయ్యాల రాజు చేతిలో – జేయి వేసి వాని పనుల జేయ సాగి నే నిబ్భంగి – జెడిపోయితి నే నయ్యయ్యాయ్యో ||త్రాహిమాం|| నిబ్బర మొక్కించుకైన – నిజము రవ్వంతైన లేక దబ్బర లాడుతకు ము – త్తా నైతిని అబ్బురమైన ఘోర పా – పాంధకార కూపమందు దబ్బున బడిపోతి నయ్యో – దారి చెడి నేనబ్బబ్బబ్బా ||త్రాహిమాం|| నిన్ను జేరి సాటిలేని – నిత్యానంద మంద బోవు చున్నప్పుడు నిందలు నా – కెన్ని చేరినా విన్నదనము లేకుండ నీ – వే నా మదికి ధైర్యమిచ్చి యన్నిట రక్షించితివి నా – యన్న నీకు స్తోత్ర మహాహా ||త్రాహిమాం|| Thraahimaam Kreesthu Naatha – Daya Jooda Raave Nenu – Dehi Yanuchu Nee Paadamule Dikkugaa Jerithi Nipudu ||Thraahimaam|| Gavva Cheyaraani Chedda – Karmendriyaadheenudanai Ravva Paalai Nenentho – Nevva Bondithi Thravvuchunna Koladi – Perugu – Daragadu Naa Paapa Raashi Yivvidhamuna Jedipothini Ne – Nemi Sethu Nohohoho ||Thraahimaam|| Nee Yandu BhayaBhakthulu Leni – Nirlajjaa Chiththamu Booni Cheyaraani Dushkarmamulu – Chesinaadanu Dayyaala Raaju Chethilo – Jeyi Vesi Vaani Panula Jeya Saagi Ne Nibbhangi – Jedipoyithi Ne Nayyayyaayyo ||Thraahimaam|| Nibbara Mokkinchukaina – Nijamu Ravvanthaina Leka Dabbara Laadutaku Mu – Ththaa Naithini Abburamaina Ghora Paa – Paandhakaara Koopamandu Dabbuna Badipothi Nayyo – Daari Chedi Nenabbabbabbaa ||Thraahimaam|| Ninnu Jeri Saatileni – Nithyaananda Manda Bovu Chunnappudu Nindalu Naa – Kenni Cherinaa Vinnadanamu Lekunda Nee – ve Naa Madiki Dhairyamichchi Yannita Rakshinchithivi Naa – Yanna Neeku Sthothra Mahaahaa ||Thraahimaam||