తెల్లవారిన వేళం - YouWorship
Thellavaarina Velam
Artist: పురుషోత్తము చౌధరి
Category: Praise & Worship
Song Lyrics
తెల్లవారిన వేళం - దెలి వొంది మన క్రీసు - దివ్య నామము బాడరె యో ప్రియులార - దివస రక్షణ వేడరే తల్లి రొమ్మున దాంచు - పిల్ల రీతిని మనలం జల్లదనముగ రాతి వెల్ల గాచిన విభుని ||తెల్లవారిన వేళ|| 1. నిద్రపోయిన వేళ - నిఖిలాపదులంబాపి - నిశలన్ని గడుపు విభునిన్ భద్రముగ వినతించి - భయభక్తితో మనము ముద్రితాక్షులం గెలు మోడ్చి ప్రభు యొక్కుచును ||తెల్లవారిన వేళ|| 2. భాను డుదయం బయ్యెం - పద్మములు వికసిల్లె - గానములు జేసెం బక్షుల్ మానసాబ్దము అలర - మనము కల్వరి మెట్ట పై నెక్కి నిను దనెడి ప్రభు జూచి వేడ్మన్ ||తెల్లవారిన వేళ|| 3. దిట్టముగ మానసేంద్రియ కాయ శోధనలు పట్టుకొని యుండు దినమున్ దట్టముగ మన నాల్గు తట్ల యేసుని కరుణం జుట్టుకొని రక్షించు శుభ మడుగుకొనుచున్ ||తెల్లవారిన వేళ|| 4. పాప భారము మనము - ప్రభుని పై నిడి గురుని పాదములు చెంత నోరిగి కాపు కర్త విశాల కరము మాటున దాగి యాపదలం దోలం గించు మని వేడుకొనుచున్ ||తెల్లవారిన వేళ|| Thellavaarina Velam - Deli Vomdi Mana Kreesu - Divya Naamamu Baadare Yo Priyulaara - Divasa Rakshana Vedare Thalli Rommuna Daamchu - Pilla Reethini Manalam Jalladanamuga Raathi Vella Gaachina Vibhuni ||Thellavaarina Vela|| 1. Nidrapoyina Vela - Nikhilaapadulambaapi - Nishalanni Gadupu Vibhunin Bhadramuga Vinathimchi - Bhayabhakthitho Manamu Mudrithaakshulam Gelu Modchi Prabhu Yokkuchunu ||Thellavaarina Vela|| 2. Bhaanu Dudayam Bayyem - Padmamulu Vikasille - Gaanamulu Jesem Bakshul Maanasaabdamu Alara - Manamu Kalvari Metta Pai Nekki Ninu Danedi Prabhu Joochi Vedman ||Thellavaarina Vela|| 3. Dittamuga Maanasemdriya Kaaya Shodhanalu Pattukoni Yumdu Dinamun Dattamuga Mana Naalgu Thatla Yesuni Karunam Juttukoni Rakshimchu Shubha Madugukonuchun ||Thellavaarina Vela|| 4. Paapa Bhaaramu Manamu - Prabhuni Pai Nidi Guruni Paadamulu Chemtha Norigi Kaapu Kartha Vishaala Karamu Maatuna Daagi Yaapadalam Dolam Gimchu Mani Vedukonuchun ||Thellavaarina Vela||