తెరువు నీ హృదయ ద్వారంబు నేడే - YouWorship
Theruvu Nee Hrudaya Dvaarambu Nede
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: తెరువు నీ హృదయ ద్వారంబు నేడే - ప్రభుయేసునందే రక్షణ కలదు (2) నిర్లక్ష్యముగా జీవించనేల (2) - వేచియున్నది తీర్పు నీ కొరకై (1) పరమున కేగుట కాయత్తపడుము - తెరువు నీ హృదయంబును (1) 1. జన్మంబుతోనే పాపివి నీవు - నీతిమంతుడే లేడు (2) కామ, క్రోధ, లోభ, మోహ, - పాపపు డాగులివియే (2) 2. ధర్మకర్మల వస్త్రంబు నీవు - కప్పుకొన్న దాగవునీ పాపము కడిగి నీతిగా తీర్చే - ఔషధంబేమి లేదు 3. తెలియదు నీకు నీ మరణ దినము - నిశ్చింతగా నుండెదవా పాప ఫలితము నరకమే వినుము - విడిపించెడి వారెవ్వరు? 4. పాపమువలన నీ జీవితమును - నష్టపరచుకొందువా? భరింపలేని నరక బాధ - ఏడ్పేగా నీ ఫలితము 5. పాపపు శిక్ష నీదై యుండ - నిన్ను రక్షింపనెంచె సిలువ శ్రమలు భరించెనేసు - నీకై రక్తము కార్చెగా 6. ఒప్పుకొనుము నీ పాపములను - అపరాధినంచు వేడు తన రక్తమందు కడుగును నిన్ను - రక్షణ నొందెదవు Pallavi: Theruvu Nee Hrudaya Dvaarambu Nede - PrabhuYesunande Rakshana Kaladu (2) Nirlakshyamugaa Jeevinchanela (2) - Vechiyunnadi Theerpu Nee Korakai (1) Paramuna Keguta Kaayaththapadumu - Theruvu Nee Hrudayambunu (1) 1. Janmambuthone Paapivi Neevu - Neethimanthude Ledu (2) Kaama, Krodha, Lobha, Moha, - Paapapu Daaguliviye (2) 2. Dharmakarmala Vasthrambu Neevu - Kappukonna Daagavunee Paapamu Kadigi Neethigaa Theerche - Aushadhambemi Ledu 3. Theliyadu Neeku Nee Marana Dinamu - Nishchinthagaa Nundedavaa Paapa Phalithamu Narakame Vinumu - Vidipinchedi Vaarevvaru? 4. Paapamuvalana Nee Jeevithamunu - Nashtaparachukonduvaa? Bharimpaleni Naraka Baadha - Edpegaa Nee Phalithamu 5. Paapapu Shiksha Needai Yunda - Ninnu Rakshimpanenche Siluva Shramalu Bharinchenesu - Neekai Rakthamu Kaarchegaa 6. Oppukonumu Nee Paapamulanu - Aparaadhinanchu Vedu Thana Rakthamandu Kadugunu Ninnu - Rakshana Nondedavu