తెరువబడియున్నది కృపద్వారము - YouWorship
Theruvabadiyunnadi Krupadvaaramu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: తెరువబడియున్నది కృపద్వారము - త్వరపడి రమ్మని పిలిచె నేసు (2) 1. ఎవరును నశియింప వలదని - ఓరిమి ప్రభువు వహియించును (2) మారు మనస్సును పొందు సమయమిదే - మక్కువతో ప్రభువు పిలుచుచున్నాడు (2) 2. ద్వారము తెరువబడియుండగ - దయచూపి నిన్ను రమ్మనె ప్రభువు దీనిని నీవు అంగీకరించిన దేవుని దీవెనలు పొందెదవు 3. రాత్రి గడచిపోయి పగలాయెను - అతిక్రమములను వీడుమనె ప్రభు నీతి సూర్యుండు ఉదయించును భీతిని విడచి సిద్ధపడుము 4. అర్థ రాత్రి వేళ గొప్ప సందడాయెను - అదిగో పెండ్లి కుమారుండు వచ్చెననియు సిద్ధముగానున్న వారే వెళ్ళెదరుగా ఆ ద్వారము మూయబడు త్వరపడుమా 5. వెళ్ళగోరియున్న సిద్ధపడవలెను - యేసు రక్తమందు శుద్ధకావలెను ఘనముగ మీరు ప్రవేశింపవలెను మన తండ్రి యొక్క పూర్ణ సంకల్పమిదే Pallavi: Theruvabadiyunnadi Krupadvaaramu - Thvarapadi Rammani Piliche Nesu (2) 1. Evarunu Nashiyimpa Valadani - Orimi Prabhuvu Vahiyinchunu (2) Maaru Manassunu Pondu Samayamide - Makkuvatho Prabhuvu Piluchuchunnaadu (2) 2. Dvaaramu Theruvabadiyundaga - Dayachoopi Ninnu Rammane Prabhuvu Deenini Neevu Anggeekarinchina Devuni Deevenalu Pondedavu 3. Raathri Gadachipoyi Pagalaayenu - Athikramamulanu Veedumane Prabhu Neethi Sooryundu Udayinchunu Bheethini Vidachi Siddhapadumu 4. Artha Raathri Vela Goppa Sandadaayenu - Adigo Pendli Kumaarundu Vachchenaniyu Siddhamugaanunna Vaare Velledarugaa Aa Dvaaramu Mooyabadu Thvarapadumaa 5. Vellagoriyunna Siddhapadavalenu - Yesu Rakthamandu Shuddhakaavalenu Ghanamuga Meeru Praveshimpavalenu Mana Thandri Yokka Poorna Sangkalpamide