తన రాజ్యమునకు మహిమకు పిలచిన - YouWorship
Thana Raajyamunaku Mahimaku Pilachina
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: తన రాజ్యమునకు మహిమకు పిలచిన - (2) మన ప్రభువుకు తగినట్టు నడిచెదము - తన రాజ్యములో మనము చేరెదము 1. కారుచీకటి కమ్మినను - యేసుని వెలుగులో నడిచెదము (2) మంచి కాపరి మనతోనుండగ - తనతో ముందుకే సాగెదము (2) 2. ఇరుకు మార్గపు ఇబ్బందులలో - సిలువను మోయుచు వెళ్ళెదము యేసే మనదు భారము మోయుచు - మనకు మార్గము చూపును 3. ఉప్పొంగుచున్న ఉపద్రవములలో - ఉన్నవాడనని ప్రభువనెను అంతము వరకు చెంత నిలిచి - తానే మనతో నడచును 4. దారితొలగక గురి యొద్దకే - యేసునే చూచి నడచెదము ఇహమున శుద్ధులై నడచువారే - పరమున ప్రభువుతో సంచరించెదరు 5. విశ్వాసమును విడువక - మంచి పోరాటం పోరాడి ప్రభువుతో నడచి పరుగు ముగించి - నీతి కిరీటము పొందెదము Pallavi: Thana Raajyamunaku Mahimaku Pilachina - (2) Mana Prabhuvuku Thaginattu Nadichedamu - Thana Raajyamulo Manamu Cheredamu 1. Kaarucheekati Kamminanu - Yesuni Velugulo Nadichedamu (2) Manchi Kaapari Manathonundaga - Thanatho Munduke Saagedamu (2) 2. Iruku Maargapu Ibbandulalo - Siluvanu Moyuchu Velledamu Yese Manadu Bhaaramu Moyuchu - Manaku Maargamu Choopunu 3. Uppongguchunna Upadravamulalo - Unnavaadanani Prabhuvanenu Anthamu Varaku Chentha Nilichi - Thaane Manatho Nadachunu 4. Daaritholagaka Guri Yoddake - Yesune Choochi Nadachedamu Ihamuna Shuddhulai Nadachuvaare - Paramuna Prabhuvutho Sancharinchedaru 5. Vishvaasamunu Viduvaka - Manchi Poraatan Poraadi Prabhuvutho Nadachi Parugu Muginchi - Neethi Kireetamu Pondedamu