తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము - YouWorship
Thambura Sithaaratho Maa Prabhuni Aaraadhinchedamu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము (2) తన నివాసముగ మమ్ము సృష్టించిన (2) నాథుని పొగడెదము స్తుతిగానము చేసెదము (2) 1. ఆది ఆదాము - మరణ శాసనము - మా శరీరమున్ - ఏలుచుండగా (2) అమరుడవై ప్రభూ - భువికేతెంచి (2) మరణపు ముల్లు విరచి - మరణమున్ - గెలిచిన మా ప్రభువా (2) 2. పాపము నుండి - చీకటి నుండి - ఆశ్చర్యకరమగు - వెలుగులో నడిపి తన ఆలయముగ చేసిన ప్రభుకు స్తుతి మహిమ - ఘనత - సీయోనులో అర్పించెదమెప్పుడు 3. పరలోక పిలుపుతో - ప్రభు మమ్ము పిలచి - నరకపు శిక్ష - తొలగించె మానుండి పరిశుద్ధులతో - మమ్ము చేర్చిన ప్రభూ నిర్మించెను యిలలో - గృహముగా - తన ఆత్మ ద్వారా 4. ఆత్మీయ యింటికి - క్రీస్తే పునాది - సజీవమైన రాళ్ళే ప్రజలు ఆత్మీయ గృహముకు - ప్రభువే శిల్పి ఆద్యంతరహితుడై - నడుపును - మోక్షపురికి మమ్ము 5. మన్నయినది - వెనుకటివలెనే - మరల భూమికి తప్పక చేరున్ మానవ సంపద - కీర్తి మహిమలు గతించి పోవునిల "సీయోను - మరువకు నీ ప్రభుని 6. లెబానోను వీడి - నాతోరమ్ము - లోకపు ఆశలు గతించిపోవును హెర్మోను గెత్సేమనే గొల్గొతా దాటుచు హెబ్రోను చేరుదము - ప్రభువును ఆరాధించెదము Pallavi: Thambura Sithaaratho Maa Prabhuni Aaraadhinchedamu (2) Thana Nivaasamuga Mammu Srushtinchina (2) Naathuni Pogadedamu Sthuthigaanamu Chesedamu (2) 1. Aadi Aadaamu - Marana Shaasanamu - Maa Shareeramun - Eluchundagaa (2) Amarudavai Prabhoo - Bhuvikethenchi (2) Maranapu Mullu Virachi - Maranamun - Gelichina Maa Prabhuvaa (2) 2. Paapamu Nundi - Cheekati Nundi - Aashcharyakaramagu - Velugulo Nadipi Thana Aalayamuga Chesina Prabhuku Sthuthi Mahima - Ghanatha - Seeyonulo Arpinchedameppudu 3. Paraloka Piluputho - Prabhu Mammu Pilachi - Narakapu Shiksha - Tholaginche Maanundi Parishuddhalatho - Mammu Cherchina Prabhoo Nirminchenu Yilalo - Gruhamugaa - Thana Aathma Dvaaraa 4. Aathmaya Yintiki - Kreesthe Punaadi - Sajeevamaina Raalle Prajalu Aathmaya Gruhamuku - Prabhuve Shilpi Aadyantharahithudai - Nadupunu - Mokshapuriki Mammu 5. Mannayinadi - Venukativalene - Marala Bhoomiki Thappaka Cherun Maanava Sampada - Keerthi Mahimalu Gathinchi Povunila "Seeyonu - Maruvaku Nee Prabhuni 6. Lebaanonu Veedi - Naathorammu - Lokapu Aashalu Gathinchipovunu Hermonu Gethsemane Golgothaa Daatuchu Hebronu Cherudamu - Prabhuvunu Aaraadhinchedamu