జై జై జై జై రాజుల రాజా - YouWorship
Jai Jai Jai Jai Raajula Raajaa
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
పల్లవి: జై జై జై జై రాజుల రాజా (2) పాత్రుడ వీవే మా ప్రభు వీవే (2) - జై జై జై జై రాజుల రాజా (2) 1. అన్ని కాలములలో నీ నామము - మహోన్నతము మహోన్నతుడా (2) వాగ్దానము నెరవేర్చిన దేవా (2) - మాట తప్పని మహోపకారి (1) 2. దూతల మాదిరి గీతముల్ పాడుచు - సతతము నిన్నే స్తోత్రించెదము గొల్లలు గాంచిన ఘన కాపరి - మా ఉల్లము నందు ఉల్లసించెదము 3. తూర్పున తారను గాంచిన జ్ఞానులు - రాజుల రాజ నీవే యనుచు బంగారము సాంబ్రాణి బోళమును - అర్పించి ఆరాధించిరిగా 4. ధనవంతుడవగు ఓ మా ప్రభువా - ధనహీనునిగా నైతివి మాకై మా దారిద్ర్యము తీసివేయ - నరరూపమున జన్మించితివి 5. యేసు ప్రభుండా రక్తము కార్చి - ఎంచి మమ్ము విమోచించితివి ఎంచలేను నీ మేలుల నెపుడు - ఎన్నదగిన మా దేవుడ నీవే 6. మాకై సిలువలో మరణించితివి - మరణపు ముల్లును విరచిన ప్రభువా యుగయుగములకు నీకే మహిమ - నిరతము స్తోత్రము హల్లెలూయ Pallavi: Jai Jai Jai Jai Raajula Raajaa (2) Paathruda Veeve Maa Prabhu Veeve (2) - Jai Jai Jai Jai Raajula Raajaa (2) 1. Anni Kaalamulalo Nee Naamamu - Mahonnathamu Mahonnathudaa (2) Vaagdaanamu Neraverchina Devaa (2) - Maata Thappani Mahopakaari (1) 2. Doothala Maadiri Geethamul Paaduchu - Sathathamu Ninne Sthothrinchedamu Gollalu Gaanchina Ghana Kaapari - Maa Ullamu Nandu Ullasinchedamu 3. Thoorpuna Thaaranu Gaanchina Gnaanulu - Raajula Raaja Neeve Yanuchu Banggaaramu Saambraani Bolamunu - Arpinchi Aaraadhinchirigaa 4. Dhanavanthudavagu O Maa Prabhuvaa - Dhanaheenunigaa Naithivi Maakai Maa Daaridryamu Theesiveya - Nararoopamuna Janminchithivi 5. Yesu Prabhundaa Rakthamu Kaarchi - Enchi Mammu Vimochinchithivi Enchalenu Nee Melula Nepudu - Ennadagina Maa Devuda Neeve 6. Maakai Siluvalo Maraninchithivi - Maranapu Mullunu Virachina Prabhuvaa Yugayugamulaku Neeke Mahima - Nirathamu Sthothramu Hallelooya