జీవితాంతము వరకు నీకే - YouWorship
Jeevithaanthamu Varaku Neeke
Artist: పి డి శుభామణి
Category: Prayer
Song Lyrics
జీవితాంతము వరకు నీకే – సేవ సల్పుదునంటిని నీవు నాతో నుండి ధైర్యము – నిచ్చి నడుపుము రక్షకా ||జీవితాంతము|| ఎన్ని యాటంకంబులున్నను – ఎన్ని భయములు కల్గిన అన్ని పోవును నీవు నాకడ – నున్న నిజమిది రక్షకా ||జీవితాంతము|| అన్ని వేళల నీవు చెంతనె – యున్న యను భవమీయవె తిన్నగా నీ మార్గమందున – పూనినడచెద రక్షకా ||జీవితాంతము|| నేత్రములు మిరుమిట్లు గొలిపెడి – చిత్రదృశ్యములున్నను శత్రువగు సాతాను గెల్వను – చాలు నీ కృప రక్షకా ||జీవితాంతము|| నాదు హృదయమునందు వెలుపట – నావరించిన శత్రులన్ చెదర గొట్టుము రూపుమాపుము – శ్రీఘ్రముగ నారక్షకా ||జీవితాంతము|| మహిమలో నీవుండు చోటికి – మమ్ము జేర్చెదనంటివే ఇహము దాటినదాక నిన్ను – వీడనంటిని రక్షకా ||జీవితాంతము|| పాప మార్గము దరికి బోవక – పాత యాశల గోరక ఎపుడు నిన్నే వెంబడింపగ – కృప నొసంగుము రక్షకా ||జీవితాంతము|| Jeevithaanthamu Varaku Neeke – Seva Salpudunantini Neevu Naatho Nundi Dhairyamu – Nichchi Nadupumu Rakshakaa ||Jeevithaanthamu|| Enni Yaatankambulunnanu – Enni Bhayamulu Kalgina Anni Povunu Neevu Naakada – Nunna Nijamidi Rakshakaa ||Jeevithaanthamu|| Anni Velala Neevu Chenthane – Yunna Yanubhavameeyave Thinnagaa Nee Maargamanduna – Pooni Nadacheda Rakshakaa ||Jeevithaanthamu|| Nethramulu Mirumitlu Golipedi – Chithra Drushyamulunnanu Shathruvagu Saathaanu Gelvanu – Chaalu Nee Krupa Rakshakaa ||Jeevithaanthamu|| Naadu Hrudayamunandu Velupata – Naavarinchina Shathrulan Chedara Gottumu Roopumaapumu – Sheeghramuga Naa Rakshakaa ||Jeevithaanthamu|| Mahimalo Neevundu Chotiki – Mammu Jerchedanantive Ihamu Daatina Daaka Ninnu – Veedanantini Rakshakaa ||Jeevithaanthamu|| Paapa Maargamu Dariki Bovaka – Paatha Yaashala Goraka Epudu Ninne Vembadimpaga – Krupa Nosangumu Rakshakaa ||Jeevithaanthamu||