జీవన తొలి సంధ్య - YouWorship
Jeevana Tholi Sandhya
Artist: గూడపాటి ఐసాక్ వరప్రసాద్
Category: Hope
Song Lyrics
జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం నా జీవన మలి సంధ్య నీతోనే అంతము (2) నా జీవన యాత్రకు మలి సంధ్య ఆసన్నమౌతుంది (2) నను సిద్ధపరచు యేసు నాథా నీతోనుండుటకు (2) ||జీవన|| నా జీవన యాత్రలో ఎన్నో అవరోధాలు నా జీవన గమనంలో ఎన్నో అవమానాలు (2) నిరీక్షణ లేని ఇతరుల పోలి దుఃఖించను నేను నా భారము నీపై మోపి ముందుకు సాగుచున్నాను (2) దేవా నీవే నా ఆశ్రయ దుర్గము (2) ||జీవన|| నా పూర్వికులందరు ఎప్పుడో గతించారు ఏదో ఒక రోజున నా యాత్ర ముగించెదను (2) నా శేష జీవితమంతయు నీకే అర్పించితినయ్యా నా వేష భాషయులన్నియు నీకే సమర్పింతును దేవా (2) దేవా నను నీ సాక్షిగ నిల్పుమా (2) ||జీవన|| Jeevana Tholi Sandhya Neethone Aarambham Naa Jeevana Mali Sandhya Neethone Anthamu (2) Naa Jeevana Yaathraku Mali Sandhya Aasannamauthundi (2) Nanu Siddha Parachu Yesu Naatha Neethonundutaku (2) ||Jeevana|| Naa Jeevana Yaathralo Enno Avarodhaalu Naa Jeevana Gamanamlo Enno Avamaaanaalu (2) Nireekshana Leni Itharula Poli Dukhinchanu Nenu Naa Bhaaramu Neepai Mopi Munduku Saaguchunnaanu (2) Devaa Neeve Naa Aashraya Durgamu (2) ||Jeevana|| Naa Poorvikulandaru Eppudo Gathinchaaru Edo Oka Rojuna Naa Yaathra Muginchedanu (2) Naa Shesha Jeevithamanthayu Neeke Arpinchithinayyaa Naa Vesha Bhaashayulanniyu Neeke Samarpinthunu Devaa (2) Devaa Nanu Nee Saakshiga Nilpumaa (2) ||Jeevana||