జయించువాడు దేవకుమారుడు - YouWorship
Jayinchuvaadu Devakumaarudu
Artist: సీయోను గీతాలు
Category: Encouraging
Song Lyrics
1. జయించువాడు దేవకుమారుడు - భయము చెందక యుండుడి (2) సర్వము పోగొట్టక స్వతంత్రించుకొనును - సర్వ దేవుని వాక్కిదే (2) 2. ఆది ప్రేమ వీడిన ఎఫెస్ సంఘమా - అదియే నీ కొఱత జయించిన నీవు జీవఫలములను - ప్రియముగ భుజియింతువు 3. శ్రేష్ఠతమగు స్ముర్నా సంఘమా శ్రమలను నే మరువన్ జయించిన నీకు రెండవ మరణము భయపడి హానిచేయదు 4. పెర్గము సభ నీ బోధయు తప్పుడు - మార్గముల నెరుగుదున్ జయించిన మరుగైన మన్నా క్రొత్త పేరు తెల్లని రాతినిత్తున్ 5. తుయతైర సభ నీశక్తి నెరుగుదున్ - నీ భయముల నెరుగుదున్ జయించిన జనులపై నధికారమిత్తున్ - వేకువ చుక్కనిత్తున్ 6. సార్థిస్ సభ నీ చావు నే నెరుగుదు - త్వరలోన స్థిరపడుము జయించిన నీకు తెల్లని వస్త్రము - లిచ్చి నిన్నొప్పుకొందును 7. ప్రియమగు ఓ ఫిలదెల్ఫియ సంఘమా - నీ అశక్యత తెలియున్ జయించిన స్తంభముగా నుంచి నీకు - క్రొత్త నామము నిడుదున్ 8. లవొదికైయ సభ నీ లక్షణముల - దౌర్భాగ్యత తెలియున్ జయించిన నిన్ను సింహాసనమున - నాతో కూర్చుండనిత్తున్ 9. జయమొందు విధమున తెల్పితి నిందు - జయించువారి భాగ్యము అపజయమును పొందు విధమును దెల్పితి - నీవెటు నిల్చెదవో 1. Jayinchuvaadu Devakumaarudu - Bhayamu Chendaka Yundudi (2) Sarvamu Pogottaka Svathanthrinchukonunu - Sarva Devuni Vaakkide (2) 2. Aadi Prema Veedina Ephes Sangghamaa - Adiye Nee Koratha Jayinchina Neevu Jeevaphalamulanu - Priyamuga Bhujiyinthuvu 3. Shreshthathamagu Smurnaa Sangghamaa Shramalanu Ne Maruvan Jayinchina Neeku Rendava Maranamu Bhayapadi Haanicheyadu 4. Pergamu Sabha Nee Bodhayu Thappudu - Maargamula Nerugudun Jayinchina Marugaina Mannaa Kroththa Peru Thellani Raathiniththun 5. Thuyathaira Sabha Neeshakthi Nerugudun - Nee Bhayamula Nerugudun Jayinchina Janulapai Nadhikaaramiththun - Vekuva Chukkaniththun 6. Saarthis Sabha Nee Chaavu Ne Nerugudu - Thvaralona Sthirapadumu Jayinchina Neeku Thellani Vasthramu - Lichchi Ninnoppukondunu 7. Priyamagu O Philadelphiya Sangghamaa - Nee Ashakyatha Theliyun Jayinchina Sthambhamugaa Nunchi Neeku - Kroththa Naamamu Nidudun 8. Lavodikaiya Sabha Nee Lakshanamula - Daurbhaagyatha Theliyun Jayinchina Ninnu Sinhaasanamuna - Naatho Koorchundaniththun 9. Jayamondu Vidhamuna Thelpithi Nindu - Jayinchuvaari Bhaagyamu Apajayamunu Pondu Vidhamunu Delpithi - Neevetu Nilchedavo