జయశీలుడవగు ఓ మా ప్రభువా - YouWorship
Jayasheeludavagu O Maa Prabhuvaa
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
పల్లవి: జయశీలుడవగు ఓ మా ప్రభువా - జయగీతముల్ పాడెదం (2) 1. పాపంబు చేత పడిచెడిన మమ్ము కరుణించి రక్షించితివి (2) కృతజ్ఞతచే హృదయము నిండె స్తుయింతుమో మా ప్రభు (2) 2. నీతియేలేని మా నీచ బ్రతుకుల్ నీ యందు స్థిరమాయెను ఉదయించెమాపై నీతి సూర్యుండు ముదమార ప్రణుతింతుము 3. అవిధేయతతో అవివేకులమై కోల్పోతిమి భాగ్యంబును నీ జ్ఞాన ఘనత ఐశ్వర్యములను దయతోడ నొసగితివి 4. శత్రుని వురిలో చిక్కిన మాతో నా సొత్తు మీరంటివి భయభీతిలోన అభయంబు నిచ్చి విడిపించితివి మా ప్రభో 5. యుద్దంబు నాది నిలుచుండి చూడుడి నేనిచ్చు రక్షణను అని ప్రభూ నీవు పోరాడితివి మా పక్షమందు నీవే 6. క్రీస్తేసు ప్రభులో ప్రతిస్థలమందు విజయోత్సాహముతో మము ఊరేగించుచు మహిమ నొందుచున్న దేవా స్తోత్రములు 7. పరిపూర్ణ కృపతో నీ విశ్వాస్యతను కనుపరచు కొంటివి నీవు విడువబడిన మమ్ము వివాహితగా జేసె హల్లెలూయా పాడెదము Pallavi: Jayasheeludavagu O Maa Prabhuvaa - Jayageethamul Paadedan (2) 1. Paapambu Chetha Padichedina Mammu Karuninchi Rakshinchithivi (2) Kruthagnathache Hrudayamu Ninde Sthuyinthumo Maa Prabhu (2) 2. Neethiyeleni Maa Neecha Brathukul Nee Yandu Sthiramaayenu Udayinchemaapai Neethi Sooryundu Mudamaara Pranuthinthumu 3. Avidheyathatho Avivekulamai Kolpothimi Bhaagyambunu Nee Gnaana Ghanatha Aishvaryamulanu Dayathoda Nosagithivi 4. Shathruni Vurilo Chikkina Maatho Naa Soththu Meerantivi Bhayabheethilona Abhayambu Nichchi Vidipinchithivi Maa Prabho 5. Yuddambu Naadi Niluchundi Choodudi Nenichchu Rakshananu Ani Prabhoo Neevu Poraadithivi Maa Pakshamandu Neeve 6. Kreesthesu Prabhulo Prathisthalamandu Vijayothsaahamutho Mamu Ooreginchuchu Mahima Nonduchunna Devaa Sthothramulu 7. Paripoorna Krupatho Nee Vishvaasyathanu Kanuparachu Kontivi Neevu Viduvabadina Mammu Vivaahithagaa Jese Hallelooyaa Paadedamu